Mercury to Gold: ఇది కదా కావాల్సింది.. మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి.. అమెరికన్ స్టార్టప్ సంచలనం
- మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి
- పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నట్లు ఓ అమెరికన్ స్టార్టప్ పేర్కొంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగారం అలంకరణ కోసం మాత్రమే కాదు.. పెట్టుబడిదారులకు మొదటి ప్రాధాన్యతగా మారింది. దీనికి గల కారణం గోల్డ్ ధరల పెరుగుదల. ఇదే సమయంలో సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. బంగారం కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పసిడి ధరలు తగ్గుతే బావుండు అని ఆలోచించే వారు లేకపోలేదు. ఇలాంటి వారికి బిగ్ రిలీఫ్ ఇవ్వబోతోంది ఓ అమెరికన్ స్టార్టప్ కంపెనీ. పాదరసాన్ని బంగారంగా మార్చడానికి ఒక మార్గాన్ని కనుగొన్నట్లు ఓ అమెరికన్ స్టార్టప్ పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన మారథాన్ ఫ్యూజన్ అణు సంలీన ప్రక్రియ ద్వారా పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయవచ్చని తెలిపింది. స్టార్టప్ ప్రకారం, బంగారం తయారీ ఫ్యూజన్ ప్లాంట్ ఒక గిగావాట్ థర్మల్ పవర్‌కు ఒక సంవత్సరంలో ఐదు వేల కిలోగ్రాముల బంగారాన్ని ఉత్పత్తి చేయగలదని తెలిపింది.
Also Read:Sandeep Kishan : నితిన్ పక్కకు పెట్టిన ప్రాజెక్ట్‌లోకి యంగ్ హీరో.. !
Also Read
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా శక్తి ఉత్పత్తి పై పరిశోధనలు కొనసాగిస్తున్న వేళ, మారథాన్ ఫ్యూజన్ అనే పరిశోధనా సంస్థ ఒక అద్భుతమైన ప్రయోగాన్ని ప్రకటించింది. ఈ ప్రయోగం ప్రకారం, వారు మెర్క్యురీ నుంచి బంగారాన్ని సృష్టించే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియను విజయవంతంగా పరీక్షించారని చెబుతున్నారు. న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది రెండు తేలికపాటి అణు గుళికలు కలిపి ఒక కొత్త, భారీ అణువుగా మారే ప్రక్రియ. ఈ ప్రక్రియలో అపారమైన శక్తి విడుదల అవుతుంది. మారథాన్ ఫ్యూజన్ ప్రకారం, వారు ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యూజన్ రియాక్టర్‌లో మెర్క్యురీ ఐసోటోప్స్‌ను ఉపయోగించి వాటిని బంగారం ఐసోటోప్స్‌గా మారుస్తున్నారు.
Also Read:Astrology: జులై 29, మంగళవారం దినఫలాలు
సూత్రప్రాయంగా, మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి చేయడం సాధ్యమే. ఎందుకంటే రెండు మూలకాలు పిరియాడిక్ టేబుల్ లో దగ్గరగా ఉంటాయి. కానీ ఇది సాధారణ రసాయనిక పద్ధతులతో సాధ్యం కాదు. ఇది కేవలం అణు స్థాయిలోనే సాధ్యపడుతుంది. మారథాన్ ఫ్యూజన్ ప్రకారం, వారి ప్రయోగం ప్రాథమిక స్థాయిలో విజయవంతమైందని, కానీ ఇది వాణిజ్యపరంగా ఉపయోగపడటానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరమని చెబుతున్నారు.
Also Read:New York: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి
ఈ పరిశోధన నిజమని రుజువైతే, భవిష్యత్తులో బంగారం ఉత్పత్తి విధానంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవచ్చు. అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నట్టు, ఈ ప్రక్రియ చాలా ఖరీదైనదే కాకుండా అధిక శక్తి వినియోగం అవసరం అవుతుంది. కాబట్టి ఇది తక్షణం ఆర్థికంగా లాభదాయకం అవుతుందా అన్నది సందేహాస్పదమే. మారథాన్ ఫ్యూజన్ చేసిన ఈ ప్రయోగం శాస్త్రీయ ప్రపంచంలో ఆసక్తిని రేకెత్తించింది. మెర్క్యురీ నుంచి బంగారం ఉత్పత్తి చేయడం ఇప్పటివరకు కేవలం సైన్స్ ఫిక్షన్‌లలో మాత్రమే కనిపించేది. ఇప్పుడు ఇది వాస్తవానికి దగ్గర కావడం న్యూక్లియర్ సైన్స్‌లో ఒక గొప్ప మైలురాయిగా భావిస్తున్నారు.
Also Read:New York: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. పోలీసు అధికారితో సహా ఐదుగురు మృతి
గత కొన్ని సంవత్సరాలుగా, మారథాన్ ఫ్యూజన్ సమర్థవంతమైన న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ సిస్టమ్‌లను అభివృద్ధి చేయడానికి దాదాపు $6 మిలియన్ల పెట్టుబడులను, $4 మిలియన్ల ప్రభుత్వ గ్రాంట్లను సేకరించింది. అయితే, వాణిజ్య ఫ్యూజన్ రియాక్టర్‌లను అభివృద్ధి చేసే వరకు, పాదరసం నుంచి బంగారాన్ని తయారు చేయాలనే కల కలగానే మిగిలిపోవచ్చు.
తాజావార్తలు
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?