రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇంకా వేసవి పూర్తి కానేలేదు అప్పుడే వర్షాకాలాన్ని తలపిస్తోంది. ఆకాశమంతా మేఘావృతమై ఈదురుగాలులతో వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్ప పీడన ద్రోణి.. ఆవర్తనం కొనసాగుతున్నాయి. ద్రోణి.. ఆవర్తనలా ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. Also Read:Andhra Pradesh: కువైట్ ప్లైట్‌లో మిస్సైన మనోహర్ కథ విషాదాంతం రాష్ట్ర వ్యాప్తంగా నేడు మోస్తరు నుంచి […]
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ ప్రభాకర్ రావును ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా పోలీసులు ప్రకటించనున్నారు. పలుమార్లు విచారణకు పిలిచినా హాజరు కాకపోవడంతో ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించనున్నారు. ప్రభకర్ రావు ను ప్రొక్లయిమ్డ్ అఫెండర్ గా ప్రకటించేందుకు మార్గం సుగమం అయ్యింది. హైదరాబాద్ పోలీసుల పిటిషన్ కు నాంపల్లి కోర్టు ఆమోదం తెలిపింది. కాగా జనవరిలోనే పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. Also Read:Gold Rates: ఒక్కరోజులోనే […]
నిన్న 490 తగ్గిన తులం గోల్డ్ ధర నేడు రూ. 2,400 పెరిగింది. ఒక్కరోజులోనే పసిడి ధరల్లో ఊహించని మార్పు చోటుచేసుకుంది. నేడు సిల్వర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 3000 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,742, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,930 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం, వెండి ధరలు ఆకాశాన్నంటుతుండడంతో కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. […]
ఇటీవలి కాలంలో చిన్న చిన్న విషయాలకే మానసిక వేధనకు గురై షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదే తరహాలో ఓ వివాహిత ఇంట్లో చోరీకి గురైన బంగారు ఆభరణాలు దొరకలేదని తీవ్ర మనస్థాపానికి గురైంది. కొడుకుతో సహా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటన వనస్థలిపురంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చింతల్‌కుంటకు చెందిన సుధేష్ణకు(28) నాలుగేళ్ల కిందట అమ్మదయ కాలనీకి చెందిన నోముల ఆశీష్ కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కుమారుడు ఆరుష్‌కుమార్ ఉన్నాడు. […]
ప్రేమ, పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. ఇదే రీతిలో ఓ వైద్యుడు లేడీ డాక్టర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వంచించాడు. తన కోరిక తీర్చుకున్నాక వివాహానికి నిరాకరించాడు. మోసపోయానని గ్రహించిన మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లేడీ డాక్టర్ హైదరాబాద్ లోని నిలోఫర్ హాస్పిటల్ లో విధులు నిర్వహిస్తోంది. మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్ స్వామి పనిచేస్తున్నాడు. Also Read:Heavy Rain Forecast: […]
విమాన ప్రయాణికులకు ఇటీవల చోటుచేసుకుంటున్న ఫ్లైట్ ప్రమాదాలు భయాందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తృటిలో మరో ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఫ్రాంక్ ఫోర్ట్ వెళ్తున్న లుఫ్తాన్స విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. విమానంలోని ముందు టైరులో సాంకేతిక లోపాన్ని గుర్తించాడు పైలెట్. వెంటనే పైలట్ విమానాన్ని రన్ వే పై దించేశాడు. ఈ సమయంలో విమానంలో 160 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ఘోర ప్రమాదం తప్పినట్లైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం […]
హయత్ నగర్ కుంట్లూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు డీసీఎంను ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు నుజ్జు నుజ్జైంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో హాస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు చంద్రసేనారెడ్డి, త్రినాద్ రెడ్డి, వర్షిత్ రెడ్డిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మృత దేహాలు […]
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని చెప్పిన స్వామీ వివేకానందా మాటలను నిజం చేశాడు ఆ యువకుడు. తన లక్ష్యం పట్ల అంకితభావం, టార్గెట్ చేధించేందుకు తను చేసిన కృషి నేడు ఆయనను దేశ అత్యున్నత సర్వీసు అయిన ఐఎఫ్ఎస్ అధికారిని చేశాయి. మరణం అంచుల వరకు వెళ్లిన అతడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్‌లో 112వ ర్యాంకును సాధించారు. అతను మరెవరో కాదు దేవానంద్ టెల్గోట్. ఇతడు మహారాష్ట్రకు చెందిన […]
కొత్త కారు కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 2 లక్షలు ఉంటే చాలు మీ కలను తీర్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి ఫ్రాంక్స్ తయారీదారుచే కాంపాక్ట్ SUV విభాగంలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికతో మారుతి సుజుకి ఫ్రాంక్స్ అందుబాటులో ఉంది. మీరు ఈ SUV ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తెచ్చుకోవచ్చు. నెలకు ఎంత EMI చెల్లించాలంటే? […]
ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంటాయి. ఆహార పదార్థాలు పలు అవయవాల క్షీణతకు దారితీస్తుంటాయి. ముఖ్యంగా కిడ్నీలు, వాటిల్లో రాళ్లు చేరడం ఇటీవలి కాలంలో ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. మన శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైన అవయవాలు. ఇవి రక్తాన్ని శుభ్రపరిచి.. శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. అయితే కొన్నిసార్లు మనం చేసే పొరపాట్లు, మన అలవాట్ల వల్ల.. కిడ్నీల్లో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి.. గట్టిపడి రాళ్లుగా మారతాయి. కిడ్నీలో రాళ్లు ఉంటే.. చాలా […]