Veerababu Burugadda
Author- NTV Telugu-
Free Bus Journey: సమ్మె వేళ వారికి భారీ ఊరట.. పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం..
తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను స్తంభింపజేసింది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో డ్రైవర్లు, కండక్టర్లు విధులకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా కరీంనగర్ డిపోలో టికెట్లు ఇచ్చేవారు లేక పురుషులు కూడా ఉచితంగా ప్రయాణించే అరుదైన పరిస్థితి కనిపిస్తోంది. కరీంనగర్ డిపోలో ప్రస్తుత పరిస్థితి.. […] -
Farmers: ఎట్టి పరిస్థితుల్లో రైతులు పంటలు సాగు చేయొద్దు.. ఆ 4 గ్రామాల ప్రజలకు కలెక్టర్ ఆదేశాలు…
ఫార్మాసిటీ భూములకు సంబంధించి రంగారెడ్డి జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములిచ్చిన రైతులు ఇకపై అక్కడ వ్యవసాయం చేయకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు అవగాహన కల్పించింది. అధికారుల క్షేత్రస్థాయి పర్యటన.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను ఆర్డీవో అనంతరెడ్డి శనివారం స్వయంగా పరిశీలించారు. నానక్ నగర్, మేడిపల్లి, కుర్మీద్ద, తాటిపర్తి గ్రామాల్లో పర్యటించిన ఆయన.. అక్కడి […] -
Tilak Varma: అరుదైన రికార్డ్ సాధించిన తిలక్ వర్మ.. ఒక్క సెంచరీతో అవన్నీ పటాపంచల్..
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ యువ కెరటం, తెలుగు తేజం తిలక్ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించాడు. కేవలం 45 బంతుల్లోనే అజేయంగా 101 పరుగులు సాధించిన తిలక్ వర్మ, మైదానం నలుమూలలా సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడి అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెంచరీ ఒక ఇన్నింగ్స్ మాత్రమే కాదు, ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక కొత్త శకానికి […] -
Jasprit Bumrah: వేట మొదలైంది.. ఫామ్‌లోకి వచ్చిన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. సీజన్లో మొదటిసారిగా..
ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ ‘యార్కర్ కింగ్’ జస్ప్రీత్ బుమ్రా తన పంజా విసిరాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న హై-వోల్టేజ్ మ్యాచ్‌లో బుమ్రా తన వికెట్ల వేటను ప్రారంభించాడు. ఈ సీజన్లో తన తొలి వికెట్‌గా ఫామ్‌లో ఉన్న స్టార్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను డకౌట్ చేయడం విశేషం. తొలి బంతికే షాక్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే బుమ్రా తన పదునైన బౌలింగ్‌తో గుజరాత్ బ్యాటర్లను వణికించాడు. బుమ్రా వేసిన […] -
KCR: కేసీఆర్ స్పీచ్.. దద్ధరిల్లిన సభా ప్రాంగణం.. ఉప్పొంగిన ఉత్సాహం..
జగిత్యాల గడ్డపై గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రసంగం ఉప్పెనలా సాగింది. చాలా కాలం తర్వాత కేసీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతుండటంతో అశేష జనవాహిని తరలివచ్చింది. ప్రస్తుతం తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్‌కు, ప్రతిపక్ష బీఆర్ఎస్కు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ.. కేసీఆర్ సభ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. తనదైన శైలిలో ప్రాసలు, జాతీయాలు జోడిస్తూ కేసీఆర్ చేసిన ప్రసంగం సభా ప్రాంగణాన్ని ఉర్రూతలూగించింది. టీవీలు, […] -
JEE Mains Session 2 Result 2026: జేఈఈ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ సెషన్ 2 ఫలితాలను విడుదల చేసింది. జనవరి , ఏప్రిల్ నెలల్లో జరిగిన రెండు సెషన్లకు సంబంధించిన తుది ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులు (AIR) ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్ , పుట్టిన తేదీ వివరాలను ఉపయోగించి అధికారిక వెబ్సైట్ ద్వారా స్కోర్‌కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో అభ్యర్థులు పరీక్షకు హాజరుకాగా, అభ్యర్థులు రెండు సెషన్లలో పాల్గొన్న సందర్భంలో […] -
Vedanta: సంచలన నిర్ణయం తీసుకున్న వేదాంత.. ఇక నుంచి 5 కంపెనీలుగా.. ఒక్క షేరుకు 5 కంపెనీల్లో షేర్లు..
ప్రముఖ మైనింగ్ దిగ్గజం వేదాంత లిమిటెడ్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఐదు స్వతంత్ర విభాగాలుగా విభజించే ప్రక్రియలో కీలక ముందడుగు వేసింది. మే 1వ తేదీని విభజన ప్రక్రియకు సంబంధించి కీలకమైన తేదీగా బోర్డు ఖరారు చేసినట్లు కంపెనీ సోమవారం స్టాక్ ఎక్స్ఛేంజీలకు వెల్లడించింది. ఈ భారీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వేదాంత గ్రూపులోని అల్యూమినియం, పవర్, ఆయిల్, ఐరన్, స్టీల్ వ్యాపారాలు వేర్వేరుగా విడిపోయి స్వతంత్రంగా లిస్ట్ కానున్నాయి. సహజ వనరుల రంగంలో భారత్‌లో చోటుచేసుకుంటున్న అతిపెద్ద […] -
Supreme Court: ఉచిత పథకాలపై కేసు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు..
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రకటించే ఉచిత హామీలపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL) పై సుప్రీంకోర్టు స్పందించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం (ECI), కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG)లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ఇతర […] -
New Airport: ఏపీ ప్రజలకు శుభవార్త.. 5000 ఎకరాల్లో అతి పెద్ద ఎయిర్ పోర్ట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని అభివృద్ధి, దూరదృష్టిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో అమరావతిని రోల్ మోడల్‌గా చూపిస్తూ.. పారిశ్రామిక హబ్ అయిన కోయంబత్తూరు అభివృద్ధిపై తనదైన విశ్లేషణ చేశారు. చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో అమరావతి ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. రాజధాని నగరాన్ని పరిపాలనా కేంద్రంగానే కాకుండా, ప్రపంచ స్థాయి ఆర్థిక హబ్‌గా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 5000 ఎకరాల విస్తీర్ణంలో భారీ […] -
Inter Exam Fee: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు చెల్లింపు గడువు పెంపు..
తెలంగాణ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు ఊరటనిస్తూ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు చెల్లింపు గడువును పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ప్రకటించిన వివరాల ప్రకారం.. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లించే గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగించారు. వాస్తవానికి ఈ గడువు అంతకుముందే ముగియాల్సి ఉన్నప్పటికీ.. విద్యార్థులు , తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు బోర్డు ఈ […]
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!