RCB Vs GT: ఐపీఎల్ 2026 ఫైనల్లో తీవ్ర వివాదం.. కోహ్లీ, అనుష్క శర్మ ఎందుకు షాక్ అయ్యారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అహ్మదాబాద్ వేదికగా ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) మధ్య జరుగుతున్న ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. గుజరాత్ బ్యాటింగ్ చేస్తుండగా 10వ ఓవర్ చివరి బంతికి ఈ డ్రామా జరిగింది.
జెకబ్ డఫీ వేసిన బంతిని గుజరాత్ బ్యాటర్ వాషింగ్టన్ సుందర్ ఫైన్ లెగ్ వైపు ఆడాడు. అక్కడ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జోర్డాన్ కాక్స్ ముందుకు డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీనితో సుందర్ అవుట్ అనుకుని పెవిలియన్ వైపు నడవడం ప్రారంభించాడు. అయితే గ్రౌండ్ అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశారు. టీవీ అంపైర్ వేర్వేరు కోణాల్లో పరిశీలించి, క్యాచ్ పూర్తి చేసే క్రమంలో బంతి నేలకు తాకిందని భావించి “నాటౌట్” గా ప్రకటించారు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్‌పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్‌కు చేర్చిన క్షణాలు..
This ipl is full of mysteries🤡
Pbks not qualifying to playoffs 🤷🏻♂️
So many catch drops😭
Dual time tosses 🤦
Umpire worst decisions 🤡 #RCBvsGT pic.twitter.com/82f77jrRU8— Koushik Naidu (@KoushikManu1130) May 31, 2026
If GT takes a controversial catch, benefit of doubt goes to them.
When RCB takes a comparatively cleaner catch, benefit of doubt still goes to GT.
What a clown umpiring!
#RCBvsGT pic.twitter.com/tMI6V0fQ8I
— Kyawal (@dhirajkyawal) May 31, 2026
Jason Holder took a catch that clearly touched the ground, but the third umpire still gave it OUT
– Jordon Cox took a similar catch, and it was called NOT OUT.
We are playing with 13 players 💔🙏#RCBvsGT #Iplfinal2026 pic.twitter.com/gE2p1CT8LQ
— RCB cult (@wateruuuu5) May 31, 2026
మైదానంలో అసంతృప్తి..
బిగ్ స్క్రీన్‌పై నాటౌట్ అని రాగానే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ మైదానంలోనే అంపైర్లతో వాదించాడు. ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం చూసి తీవ్ర ఆశ్చర్యానికి లోనయ్యాడు. స్టేడియంలో ఉన్న అతని భార్య అనుష్క శర్మ కూడా ఈ నిర్ణయాన్ని నమ్మలేక షాక్‌లో ఉండిపోయింది. లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ ప్లేయర్ జేసన్ హోల్డర్ పట్టిన ఇలాంటి క్యాచే అవుట్‌గా ఇచ్చారని, ఇప్పుడు మాత్రం నాటౌట్ ఇవ్వడం ఏంటని సోషల్ మీడియాలో అభిమానులు అంపైరింగ్‌ను తప్పుబడుతున్నారు.
అంతకుముందు టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆర్సీబీ పాత జట్టుతోనే బరిలోకి దిగగా, గుజరాత్ జట్టు సాయి కిషోర్ స్థానంలో అర్షద్ ఖాన్‌ను తీసుకుంది. కాగా, రెండు జట్లు కూడా తమ రెండో ఐపీఎల్ టైటిల్ కోసం తలపడుతున్నాయి. గుజరాత్ 2022లో కప్ గెలవగా, ఆర్సీబీ గత ఏడాది (2025) తమ తొలి టైటిల్ సాధించి, ఇప్పుడు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో ఉంది. ప్రస్తుతం గుజరాత్ బ్యాటింగ్ ముగిసింది. 8 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసిన జీటీ.. ఆర్సీబీకి 156 పరుగుల టార్గెట్ ఇచ్చింది.
తాజావార్తలు
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
-
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో ఆ మాటలు వినిపించవు
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?