తమిళనాడులో దారుణం జరిగింది. అల్లుడిని మామ అత్యంత ఘోరంగా హతమార్చాడు. కొడవలితో తల, చేతులు, కాళ్లపై పదే పదే నరకడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులోని రామనాయకన్‌పట్టికి చెందిన పాల వ్యాపారి రామచంద్రన్ (24), బట్లగుండు సమీపంలోని గణపతిపట్టికి చెందిన బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్తి (21) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయింది. అనంతరం ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి పెళ్లికి యువతి కుటుంబం వ్యతిరేకించింది. దీంతో ఇద్దరూ మూడు నెలల క్రితం పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Meloni: మెలోని అందమైన అమ్మాయి.. అలాంటే అభ్యంతరం లేదు కదా? నవ్వులు పూయించిన ట్రంప్
ఆదివారం సాయంత్రం రామచంద్రన్ ద్విచక్ర వాహనంపై కూజిపట్టికి వెళుతుండగా కూట్టతు అయ్యంపాలయం వంతెన సమీపంలో అతని మామ చంద్రన్ (49) అడ్డగించి వాగ్వాదానికి దిగాడు. అనంతరం కొడవలితో దాడి చేశాడు. రామచంద్రన్ తల, చేతులు, కాళ్లపై పదే పదే దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Meloni: ట్రంప్ శాంతికర్త అంటూ షెహబాజ్ షరీఫ్ పొగడ్తలు.. మెలోని సంజ్ఞలు వైరల్
జంట వేర్వేరు కులాలకు చెందినవారు. అయితే పరువు హత్యను పోలీసులు తోసిపుచ్చారు. బాధితులిద్దరూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వారు కాదని.. అయితే హత్య వెనుక ఉన్న కారణాన్ని వెలికితీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తమిళనాడులో నేరాలు పెరుగుతున్నాయని, శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. అధికార డీఎంకే ఆరోపణలను తోసిపుచ్చింది. నేరాలు చాలా వరకు వ్యక్తిగత శత్రుత్వం వల్లే జరిగాయని, ప్రభుత్వం అటువంటి కేసులన్నింటిలో కఠినమైన చర్యలు, వేగవంతమైన చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
ఇది కూడా చదవండి: Shashi Tharoor: మోడీ మంచి అవకాశాన్ని కోల్పోయారు.. శాంతి సదస్సుకు వెళ్లకపోవడాన్ని తప్పుపట్టిన శశిథరూర్