ఢిల్లీ యూనివర్సిటీలో అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు చూస్తుండగానే ఒక ప్రొఫెసర్‌పై విద్యార్థిని దాడికి పాల్పడింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇటీవల యూనివర్సిటీలో విద్యార్థి మండలి ఎన్నికలు జరిగాయి. నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) నుంచి ఒక అభ్యర్థి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. ఏబీవీపీ సభ్యులు మరో రెండు స్థానాలు గెలుచుకున్నారు. అయితే ఎన్ఎస్‌యూఐ విజేతను ఏబీవీపీ మద్దతుదారులు దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విశ్వవిద్యాలయం యాజమాన్యానికి ఫిర్యాదు అందింది.
ఇది కూడా చదవండి: Corruption Case: ఏ బ్యాగ్ చూసినా డబ్బులే.. ఐపీఎస్ అధికారి ఇంట్లో భారీగా క్యాష్, లగ్జరీ వాహనాలు, బంగారం సీజ్..!
దీంతో ఈ సమస్య పరిష్కారానికి ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ కళాశాల ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌ను కళాశాల క్రమశిక్షణా కమిటీ కన్వీనర్‌గా నియమించారు. ఇక దర్యాప్తులో భాగంగా గురువారం క్యాంపస్‌లో విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఊహించని రీతిలో ప్రొఫెసర్ సుజిత్ కుమార్‌ను విద్యార్థి నాయకురాలు చెంపదెబ్బ కొట్టింది. పోలీసులు, అనేక మంది చూస్తుండగానే ఈ దాడి జరిగింది. దీంతో ప్రొఫెసర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఉపాధ్యాయ, లెక్చరర్ల సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విశ్వవిద్యాలయ బోధనా సంఘం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని వైస్-ఛాన్సలర్‌కు లేఖ రాశారు.
ఇది కూడా చదవండి: Modi-Trump: రష్యా చమురుపై మోడీ-ట్రంప్ మధ్య అలాంటి సంభాషణ ఏం జరగలేదు.. ఖండించిన భారత్
‘‘బీఆర్ అంబేద్కర్ కళాశాలలో సీనియర్ అధ్యాపకుడు అధికారిక విధులు నిర్వర్తిస్తున్నప్పుడు కళాశాల లోపల కొంతమంది విద్యార్థులు అతనిపై చెంపదెబ్బ కొట్టి దాడి చేశారని తెలిసి మేము దిగ్భ్రాంతి చెందాము. ఇటువంటి హింసాత్మక చర్యలకు విద్యా సంస్థలో స్థానం లేదు. అవి బోధనా సమాజ గౌరవానికి ప్రత్యక్ష అవమానం. ఈ సంఘటన ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో భయం, అభద్రతా వాతావరణాన్ని పెంపొందిస్తుంది.’’ అని ఢిల్లీ విశ్వవిద్యాలయ ఉపాధ్యాయ సంఘం (DUTA) లేఖలో ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ప్రొఫెసర్ సుజిత్ కుమార్ దుర్భాషలాడారని.. అంతేకాకుండా బెదిరించారని విద్యార్థి నాయకురాలు చెప్పుకొచ్చింది. అధికారులు జోక్యం చేసుకోవాలని పదే పదే అభ్యర్థించానని.. కానీ వారు నిశ్శబ్దంగా ఉన్నారని తెలిపింది. ప్రొఫెసర్ వ్యాఖ్యలను చూస్తుంటే మద్యం మత్తులో ఉన్నట్లు కనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. ‘‘నేను ఉద్రేకంతో ప్రవర్తించానని అంగీకరిస్తున్నాను. నేను స్పందించిన తీరుకు చింతిస్తున్నాను. బోధనా సమాజానికి నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను. ఉపాధ్యాయులను అగౌరవపరచాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ విద్యార్థి ప్రతినిధిగా, ప్రొఫెసర్ కుమార్ పదేపదే దుర్వినియోగ ప్రవర్తన, బెదిరింపు ప్రవర్తన నన్ను అసురక్షితంగా భావించేలా చేసింది.’’ అని ఆమె చెప్పారు. క్యాంపస్‌లో మహిళల భద్రత గురించి తాను ప్రధానంగా ఆందోళన చెందుతున్నానని విద్యార్థి నాయకురాలు తెలిపారు. ‘‘కళాశాల పరిపాలనకు నా ఏకైక విజ్ఞప్తి ఏమిటంటే.. మద్యం సేవించిన లేదా రాజకీయ పక్షపాతంతో ప్రేరేపించబడిన ఏ సిబ్బందిని లేదా వ్యక్తిని మళ్ళీ కళాశాల ఆవరణలోకి అనుమతించకుండా చూసుకోవాలి.’’ అని ఆమె అన్నారు.
ఇది కూడా చదవండి: Gujarat: గుజరాత్‌లో నేడు మంత్రివర్గ విస్తరణ.. జడేజా భర్యకు ఛాన్స్..! కొత్త మంత్రులు పేర్లు ఇవే..?
ప్రొఫెసర్‌పై దాడిని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ అధ్యక్షుడు వరుణ్ చౌదరి ఖండించారు. ‘‘పోలీసుల సమక్షంలో ప్రొఫెసర్‌పై జరిగిన దాడి విద్యా సంఘం గౌరవంపై దాడి. ఇందులో పాల్గొన్న వారిని వెంటనే అరెస్టు చేయాలి. క్యాంపస్‌లో క్రమశిక్షణను పునరుద్ధరించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.’’ అని అన్నారు.