Suresh Maddala
Author- NTV Telugu-
Mumbai: బద్లాపూర్ రైల్వేస్టేషన్లో కాల్పులు.. ఒకరికి గాయాలు
మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వేస్టేషన్లో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ప్లాట్‌ఫామ్-1పై ఒకరు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. అప్రమత్తమైన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు. -
CV Ananda: పోలీసులపై బెంగాల్ గవర్నర్ తీవ్ర విమర్శలు.. నేరస్థులున్నారని వ్యాఖ్య
కోల్‌కతా హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేస్తున్న వేళ పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ.ఆనంద్.. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసుల్లో కొంత మంది నేరాల్లో భాగమయ్యారని, అవినీతికి పాల్పడుతున్నారని, రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. -
UP: యోగి సర్కార్ తీరుపై ములాయం కోడలు అపర్ణ అలక.. ఎస్పీలో చేరేందుకు ఏర్పాట్లు!
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ ప్రభుత్వం నూతన మహిళా కమిషన్‌లో వైస్‌ఛైర్‌పర్సన్‌గా నియమించడంపై ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. -
UP: పోలీసుల ఎన్కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ హతం
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ మంగేష్ యాదవ్ హతమయ్యాడు. అతడి తలపై రూ.1లక్ష రివార్డు ఉంది. ఆగస్టు 28న వారణాసిలోని తాథేరి బజార్‌లోని నగల దుకాణంలో రూ.1.5 కోట్లు విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. మరో నలుగురితో కలిసి ఈ చోరీకి పాల్పడ్డాడు. -
France: ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నిక
ఫ్రాన్స్ కొత్త ప్రధానిగా మిచెల్ బార్నియర్ ఎన్నికయ్యారు. ఫ్రాన్స్ ముందస్తు ఎన్నికలు ముగిసిన దాదాపు రెండు నెలల తర్వాత ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. మిచెల్ బార్నియర్‌ను ప్రధానమంత్రిగా నియమించారు. -
Delhi: రాష్ట్రపతి భవన్లో టీచర్స్ డే వేడుకలు.. అవార్డులు అందుకున్న తెలుగు రాష్ట్రాల టీచర్లు వీరే!
ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో టీచర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఉత్తమ ఉపాధ్యాయులు అవార్డులు అందుకున్నారు. -
Rahul Gandhi: మహారాష్ట్రలో శివాజీ విగ్రహం కూలిపోవడంపై రాహుల్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలోని సింధుదుర్గ్‌లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. శివాజీ విగ్రహం కూలిపోవడం మరాఠా దిగ్గజానికి అవమానకరమని అన్నారు. -
RG Kar hospital: వెలుగులోకి సందీప్ ఘోష్ ఆగడాలు.. వైద్యురాలు హత్యాచారం తర్వాత మాజీ ప్రిన్సిపాల్ ఏం చేశాడంటే..!
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. అనంతరం న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు జరిగాయి. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అయితే ఈ ఘటన తర్వాత నిందితుడు సంజయ్ రాయ్‌ను అరెస్ట్ చేసినా.. అన్ని వేళ్లు మాత్రం ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ వైపే చూపించాయి. -
Kejriwal: సుప్రీంకోర్టులో లభించని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. వచ్చే మంగళవారానికి తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలంటూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. -
Stock market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ వరుస నష్టాల్లో కొనసాగుతోంది. గత వారం సూచీలు రికార్డుల జోరు సాగించగా.. ఈ వారం మాత్రం రివర్స్‌లో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లోని మిశ్రమ సంకేతాలు మన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి
తాజావార్తలు
-
UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్‌రాజ్‌లో ఎస్పీ నేత హత్య
-
Cheyutha Pension : గుడ్‌న్యూస్.. చేయూత పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?