Suresh Maddala
Author- NTV Telugu-
Tamil nadu: ఐదుగురు కుటుంబ సభ్యులతో వ్యాపారవేత్త ఆత్మహత్య.. సూసైడ్ నోట్లో ఏముందంటే..!
తమిళనాడులో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్త కుటుంబం బలవన్మరణానికి పాల్పడింది. ఓ పాడుబడిన కారులో మృతదేహాలు లభించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తు్న్నారు. -
Stock market: మరోసారి ఆల్‌టైమ్ రికార్డులను సృష్టించిన స్టాక్ మార్కెట్
దేశీయ స్టాక్ మార్కెట్ మరోసారి సరికొత్త రికార్డ్‌ను సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు కారణంగా గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు.. కొద్దిసేపటికే జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 85, 372 మార్కు క్రాస్ చేయగా.. నిఫ్టీ 26, 200 మార్కు క్రాస్ చేసి ఆల్‌టైమ్ రికార్డులను సొంతం చేసుకున్నాయి. -
Israel-Labanon war: లెబనాన్‌లోని ఓ ఇంటిపై ఇజ్రాయెల్ దాడి.. 23 మంది సిరియన్లు మృతి
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉధృతంగా మారాయి. గత వారం నుంచి లెబనాన్‌పై ఇజ్రాయెల్ దూకుడుగా పోతుంది. మొదట కమ్యూనికేషన్ వ్యవస్థపై దెబ్బకొట్టగా.. అటు తర్వాత రాకెట్లకు పని చెప్పింది. పేజర్లు, వాకీటాకీలు పేలి వందల మంది చనిపోయారు. -
Mumbai Rain: ముంబైకి రెడ్ అలర్ట్ జారీ.. విద్యాసంస్థలు బంద్
ఆర్థిక రాజధాని ముంబైను కుండపోత వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం కురిసిన వర్షంతో నగరం అతలాకుతలం అయిపోయింది. విద్యార్థులు, ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయంలో అత్యంత భారీ వర్షం కురవడంతో జనాలకు చుక్కలు కనిపించాయి. -
US Election: ముందంజలో దూసుకెళ్తోన్న కమలాహారిస్.. తాజా సర్వేలో ఎన్ని ఓట్లు వచ్చాయంటే..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో కమలాహారిస్ దూసుకెళ్లిపోతున్నారు. తాజా సర్వేలో ఆమె ముందంజలో ఉన్నారు. డెమొక్రాట్ అభ్యర్థిగా కమలాహారిస్.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ బరిలో ఉన్నారు. నవంబర్లోనే అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అయితే తాజాగా జరిగిన సర్వేలో ట్రంప్‌ను కమల వెనక్కి నెట్టినట్లు రాయిటర్స్-ఇప్సోస్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. -
Mumbai Rain: ముంబైను ముంచెత్తిన భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
ఆర్థిక రాజధాని ముంబైను భారీ వర్షం ముంచెత్తింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లు జలమయం అయ్యాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విమాన రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. వాహనదారులు కూడా ఇక్కట్లు ఎదుర్కొన్నారు. స్పైస్‌జెట్ మరియు విస్తారా కొన్ని విమానాలను దారి మళ్లించినట్లు ఎక్స్‌లో పేర్కొన్నాయి. -
Vinesh phogat: వినేష్ ఫోగట్‌కు నాడా నోటీసు.. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని వెల్లడి
భారత స్టార్ రెజ్లర్, కాంగ్రెస్ నేత వినేష్ ఫోగట్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ బుధవారం నోటీసు జారీ చేసింది. పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో బరువు కారణంగా అనర్హత వేటుపడింది. 14 రోజుల్లో వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. 100 గ్రాములు ఎక్కువగా ఉండడంతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించింది. అంతేకాకుండా క్రీడల నుంచి రిటైర్మెంట్ కూడా ప్రకటించేసింది. -
Atishi: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి జెడ్ కేటగిరీ భద్రత కేటాయింపు
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషికి ఢిల్లీ పోలీసులు జెడ్ కేటగిరీ భద్రత కల్పించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు అతిషికి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వర్తిస్తుంది. ప్రోటోకాల్ ప్రకాశం ఆమె కాన్వాయ్‌లో ఇకపై పైలట్ సహా పోలీసు సిబ్బందితో భద్రత కల్పించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. -
Israel-Lebanon War: లెబనాన్‌పై మరోసారి ఇజ్రాయెల్ భారీ దాడులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. లెబనాన్‌పై తాజాగా మరోసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. హిజ్బుల్లా ప్రదేశాలే లక్ష్యంగా 60 రాకెట్లు ప్రయోగించినట్లుగా ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. -
US: అమెరికాలో బస్సు హైజాక్.. కొనసాగుతున్న ఉత్కంఠ
అగ్ర రాజ్యం అమెరికాలో బస్సు హైజాక్ తీవ్ర కలకలం రేపుతోంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఒక దుండగుడు హైజాక్ చేసినట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు.. బస్సును చుట్టుముట్టినట్లుగా సమాచారం. అయితే బస్సులో ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు. అలాగే హైజాకర్స్ ఎంత మంది ఉన్నారన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ సాగుతోంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?