కొడంగల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఉత్తరాఖండ్‌లో పట్టపగలే ఇద్దరు దుండగులు ఘాతుకానికి తెగబడ్డారు. ఉదమ్ సింగ్ నగర్‌లోని నానక్‌మట్టా సాహిబ్ గురుద్వారా ఆవరణలో డేరా కరసేవ చీఫ్ బాబా తర్సేమ్ సింగ్‌ను బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ మరోసారి తండ్రయ్యారు. ఆయన భార్య గురుప్రీత్ కౌర్ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి మాన్ ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా తెలియజేశారు.
ముంబై మలాడ్ ఈస్ట్‌లోని వర్దమాన్ గార్మెంట్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని 8 ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వ్యాఖ్యలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని ఆమ్ఆద్మీ పార్టీ పేర్కొంది.
ఢిల్లీ మద్యం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేలా ఆదేశించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. గురువారం దీనిపై న్యాయస్థానం విచారించనుంది.
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అరెస్ట్ విషయంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని ఆమె తేల్చారు.