అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లూయిస్‌విల్లే విమానాశ్రయం సమీపంలో అతి పెద్ద కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. విమానం కూలిపోగానే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. విమానం లూయిస్‌విల్లేలోని ముహమ్మద్ అలీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హోనోలులుకు వెళ్తుండగా మంగళవారం సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో విమానం కూలిపోయింది.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneshwari: లండన్‌లో 2 ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న నారా భువనేశ్వరి
ముగ్గురు వ్యక్తులతో యూపీఎస్ కార్గో విమానం.. కెంటుకీలోని లూయిస్‌విల్లేలోని విమానాశ్రయం నుంచి బయలుదేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఎయిర్‌పోర్టు సమీపంలో కూలిపోయింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. 11 మంది గాయపడినట్లు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.
ఇది కూడా చదవండి: Off The Record: సైలెంట్ మోడ్‌లో కేతిరెడ్డి పెద్దారెడ్డి..! బలవంతపు మౌనమా..?
విమానం పైకి లేవగానే ఎడమ రెక్కపై మంటలు అంటుకున్నాయి. పొగలు కమ్ముకోవడం వీడియోలో కనిపించింది. అంతలోనే కూలిపోయింది. బాధితుల కోసం ప్రార్థిస్తున్నట్లు కెంటుకీ గవర్నర్ ఆండీ బెషీర్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెప్పారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించారు. విమానంలో ఎక్కువగా ఇంధనం ఉండడం వల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
New footage about UPS cargo plane crash near Louisville, Kentucky airport showing the fire during take-off. pic.twitter.com/p93xAw6qa4
— aircraftmaintenancengineer (@airmainengineer) November 4, 2025
ఇది కూడా చదవండి: Off The Record: వాళ్ల ప్రేలాపనంతా ఆయన మెప్పుకోసమేనా..? అధినేత ప్రాపకం కోసమే నోటికి ఏదొస్తే అది మాట్లాడేశారా..?

Heartbreaking images coming out of Kentucky tonight.
Here’s an update from @FAANews
– UPS cargo flight 2976
– Crashed around 5:15 ET after takeoff from Louisville Muhammad Ali International Airport en route to Honolulu
– The aircraft was a McDonnell Douglas MD-11.Please… pic.twitter.com/yE1Brhv8cQ
— Secretary Sean Duffy (@SecDuffy) November 4, 2025