Trump: ఆ కారణాలతోనే ఓడిపోయాం.. రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ
- ఆ కారణాలతోనే ఓడిపోయాం
- రిపబ్లికన్ల ఓటమిపై ట్రంప్ విచిత్ర విశ్లేషణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులన్నీ డెమోక్రాటిక్ పార్టీ కైవసం చేసుకుంది.
తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్రంప్ వైరటీగా స్పందించారు. బ్యాలెట్‌పై తన పేరు లేకపోవడంతోనే రిపబ్లికన్లకు ఓటమి ఎదురైందన్నారు. మరోవైపు షట్‌డౌన్ పరిస్థితులు కూడా ఒక కారణంగా చెప్పారు. ఈ మేరకు ఆయన ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Trump Freebie Politics: ట్రంప్ ‘‘ఉచితాలు’’.. భారత ఎన్నికల నుంచి పాఠాలు.?
ఇది కూడా చదవండి: New York Mayor Elections: ట్రంప్‌కు భారీ షాక్.. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ విజయం
జనవరిలో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. వైట్‌హౌస్‌కు వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. అనూహ్యంగా డెమోక్రాట్లు భారీ విజయాన్ని అందుకున్నారు. అన్ని చోట్ల రిపబ్లికన్లు ఓటమి పాలయ్యారు. ఈ ఓటమిపై ట్రంప్ మాట్లాడుతూ.. బ్యాలెట్‌లో తన పేరు లేకపోవడం.. రెండోది షట్‌డౌన్ కారణం అని పేర్కొన్నారు. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే ఇంధన ఖర్చులు మూడు రెట్లు పెరుగుతాయని ట్రంప్ హెచ్చరించినా ఓటర్లు ఏ మాత్రం లెక్కచేయలేదు.
ఇది కూడా చదవండి: Plane Crashe: అమెరికాలో కూలిన అతిపెద్ద కార్గో విమానం.. ముగ్గురు మృతి
న్యూయార్క్ మేయర్ ఎన్నికల ఫలితాల్లో ఇండియన్-అమెరికన్ ముస్లిం అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ ఘన విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా మమ్దానీ రికార్డ్ సృష్టించారు. శతాబ్ద కాలంలో న్యూయార్క్ మేయర్‌గా అతి పిన్న వయస్కుడైన మమ్దానీ (34) ఎన్నికై చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ మేయర్‌గా మమ్దానీ జనవరి 1, 2026న ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మమ్దానీ బ్యాగ్రౌండ్
మమ్దానీ.. అక్టోబర్ 18, 1991లో జన్మించారు. ఉగాండాలోని కంపాలాలో పుట్టారు. విద్యావేత్త మహమూద్ మమ్దానీ, చిత్ర నిర్మాత మీరా నాయర్ దంపతులకు జన్మించారు. మమ్దానీ ఐదేళ్ల వయసులో సౌతాఫ్రికాకు వచ్చారు. అనంతరం ఏడేళ్ల వయసులో అమెరికాకు వచ్చి స్థిరపడ్డారు. బ్రోంక్స్ హై స్కూల్ ఆఫ్ సైన్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 2014లో మైనేలోని బౌడోయిన్ కళాశాల నుంచి ఆఫ్రికానా అధ్యయనాల్లో మేజర్ డిగ్రీని పొందారు.
మమ్దానీ భార్య పేరు రమా సవాఫ్ దువాజీ. ఈమె సిరియన్-అమెరికన్ చిత్రకారిణి. దువాజీ టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో సిరియన్ తల్లిదండ్రులకు జన్మించింది. యూఎస్, దుబాయ్‌లో ఎక్కువ కాలం గడిపారు. ఖతార్‌లోని వర్జీనియా కామన్వెల్త్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ది ఆర్ట్స్‌లో చదువుకున్నారు. అనంతరంత న్యూయార్క్‌లోని స్కూల్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ నుంచి ఇలస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోసం విశ్వవిద్యాలయంలోని రిచ్‌మండ్ క్యాంపస్‌కు బదిలీ అయ్యారు.
దువాజీ.. న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన వెంటనే 2021లో డేటింగ్ యాప్ హింజ్ ద్వారా మమ్దానీని కలిశారు. అక్టోబర్ 2024లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఫిబ్రవరి 2025లో న్యూయార్క్ నగర క్లర్క్ కార్యాలయంలో వివాహం చేసుకున్నారు.
దువాజీ రచనలు..
ది న్యూయార్కర్, వోగ్, బీబీసీ, ది వాషింగ్టన్ పోస్ట్, టేట్ మోడర్ వంటి ప్రచురణల్లో దువాజీ రచనలు ముద్రింపబడ్డాయి. తరచుగా మధ్యప్రాచ్య మహిళల అనుభవాలను అన్వేషిస్తూ ఉండేవారు.



తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?