Delhi Car Blast: 3 పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు.. వెలుగులోకి షాహీన్ ప్రేమకథ!
- వెలుగులోకి డాక్టర్ షాహీన్ ప్రేమకథ!
- 3 పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు
- అల్-ఫలాహ్ వర్సిటీ కేంద్రంగా ఉగ్ర కుట్ర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దర్యాప్తులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఎంత పెద్ద కుట్ర జరిగిందో దర్యాప్తు అధికారులు తేల్చారు. టెర్రర్ మాడ్యూల్‌లో ఉన్న అనేక మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్ర డాక్టర్లు ఉమర్, షాహీన్, ముజమ్మిల్ దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్ర పన్నినట్లుగా తేల్చారు.
షాహీన్ ప్రేమకథ..
తాజాగా షాహీన్(46) ప్రేమకథ వెలుగులోకి వచ్చాయి. ఇటీవల విచారణలో ముజమ్మిల్ కీలక విషయాలు వెల్లడించాడు. డాక్టర్ షాహీనా తన లవర్ కాదని.. తన భార్య అని చెప్పుకొచ్చాడు. వీరిద్దరికి 2023, సెప్టెంబర్‌లో వివాహం అయింది. అల్-ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలోనే పెళ్లి జరిగింది. ముజమ్మిల్‌ను షాహీనా పెళ్లి చేసుకోక ముందే ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యాయి. తాజాగా ఆమె మొదటి భర్త డాక్టర్ జాఫర్ హయత్ వెల్లడించాడు.
Also Read
- Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
- Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
- Su-57, Super Sukhoi, S-500: ఎస్యు-57, సూపర్ సుఖోయ్, ఎస్-500... రష్యా రక్షణ ప్రతిపాదనల జాబితాలో ఏమున్నాయి?
- Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
షాహీనా 2003లో కంటి వైద్యుడు జాఫర్ హయత్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ బంధం ఎంత కాలం నిలవలేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు కారణంగా 2012లో విడాకులు మంజూరయ్యాయి. వృత్తిపరమైన ఒత్తిడి, కెరీర్, విదేశాలకు వెళ్లాలనే కోరిక కారణంగా ఆ దంపతులకు విడాకులు మంజూరయ్యాయి. అయితే ఆమె మనసులో ఏముందో.. ఏమో తెలియదు గానీ.. ఎప్పుడూ తమ మధ్య వివాదం గానీ.. గొడవలు గానీ లేవని డాక్టర్ హయత్ తెలిపాడు. తనను.. పిల్లల్ని బాగానే చూసుకునేదని చెప్పుకొచ్చాడు. పెళ్లి సమయంలో తప్ప ఆమె ఎప్పుడూ బురఖా ధరించలేదని హయత్ పేర్కొన్నాడు. మంచి జీవితం కోసం ఆస్ట్రేలియా లేదా యూరప్‌లో స్థిరపడాలని మాత్రం ఒకసారి అన్నట్లుగా తెలిపాడు. అయితే పిల్లలు, బంధువుల కోసం తాను వద్దని చెప్పినట్లుగా వెల్లడించాడు.
ఇది కూడా చదవండి: MS Dhoni: పెళ్లంటే నిప్పుతో చెలగాటమే.. కొత్త జంటతో ధోని చమత్కారం!
ఇక విడాకుల తర్వాత షాహీనా ఒంటరిగానే ఉంది. గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ (GSVM) మెడికల్ కాలేజీ నుంచి అకస్మాత్తుగా వైదొలిగింది. ఎటువంటి నోటీసు లేకుండా కాలేజీకి హాజరు కావడం మానేసింది. ఇక ఎనిమిది సంవత్సరాలుగా ఎవరికీ తెలియకుండానే ఉండిపోయింది. ఈ క్రమంలోనే షాహీనా రెండో పెళ్లి చేసుకుంది. ఘజియాబాద్‌లో వస్త్ర వ్యాపారం నడుపుతున్న వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఈ వివాహం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు.
ఇది కూడా చదవండి: Udaipur Wedding: వెలుగులోకి కళ్లు బైర్లు కమ్మే విషయాలు.. ఈడీ అదుపులో ర్యాపిడో డ్రైవర్!
ఇక షాహీనా రెండో పెళ్లి కూడా పెటాకులు అవ్వడంతో హర్యానాలోని అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలో సీనియర్ డాక్టర్ అయిన ముజమ్మిల్ పరిచయం అయ్యాడు. దీంతో 2023, సెప్టెంబర్‌లో వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. ఒకే కళాశాలలో పని చేయడం, రోజువారీ సమావేశాలతో ఇద్దరి మధ్య స్నేహం పెరిగి పెళ్లికి దారి తీసింది. ఈ క్రమంలోనే ఇద్దరూ కూడా ఉగ్రవాదం వైపు అడుగులు పడ్డాయి. జైషే మహమ్మద్ మహిళా విభాగానికి భారత్‌లో షాహీన్ నాయకత్వం వహించింది. అనేక మందిని ఉగ్రవాదం వైపు ఉరికొల్పింది. ఇలా డాక్టర్లు ఉమర్, మజమ్మిల్, షాహీనా కుట్ర పన్నారు. అయితే నవంబర్ 10న ఉమర్ కారులో వెళ్తుండగా సడన్‌గా బ్లాస్ట్ అయింది. ఈ పేలుడులో 15 మంది చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఇక అధికారులు రంగంలోకి దిగిన తర్వాత ఈ కుట్ర కోణాలు బయటపడ్డాయి.
తాజావార్తలు
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
TFTDDA Dispute: డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో కీలక మలుపు.. సెప్టెంబర్ 13 సమావేశంపై కోర్టు స్టే!
-
Explainer: సిక్కులపై అమెరికా పగ పట్టిందా?
-
Xi Jinping: భారత్‌లో అడుగు పెట్టిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. మోడీతో భేటీపై అందరి చూపు..
-
MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ట్రెండింగ్
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..