పహల్గామ్లో మారణహోమం సృష్టించిన ముష్కరులు హతమయ్యారు. సైన్యం చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్లో ముగ్గురు ఉగ్రవాదులు కుక్కచావు చచ్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సైన్యం అధికారికంగా ధృవీకరించినట్లు ఆలిండియా రేడియో వైబ్సైట్లో పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి గట్టి బుద్ధి చెప్పినట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్లో హాట్‌హాట్‌గా చర్చ మొదలైంది. ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి హేయమైన చర్యగా పేర్కొన్నారు.
కర్ణాటకలో అధికార మార్పిడిపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య-డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇటీవల రెండు వర్గాలుగా విడిపోయి విమర్శలు చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ఈ మధ్య వరుస హత్యలతో రాష్ట్రం అట్టుడుకుతోంది. తాజాగా అంబులెన్స్‌లో ఓ యువతిపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపుతోంది.
దేశంలో రోజురోజుకు మహిళల అకృత్యాలు పెరిగిపోతున్నాయి. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న వాళ్లనే కాటికి పంపేస్తున్నారు. మొన్నటికి మొన్న మీరట్‌లో భర్తను చంపి డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేసింది ఓ ఇల్లాలు.
ఎన్ని కఠిన చట్టాలొచ్చినా దొంగలు బుద్ధి మార్చుకోవడం లేదు. దొంగతనం కోసం ఎంత సాహసాలకైనా తెగిస్తున్నారు. తాజాగా ఒక దొంగ రైల్లో మొబైల్ దొంగతనం చేశాడు. అనంతరం వేగంగా వెళ్తున్న రైల్లోంచి దూకేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ప్రొఫెసర్ల వేధింపులకు విద్యాకుసుమాలు రాలిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఒడిశాలో అధ్యాపకుల వేధింపుల కారణంగా విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మరువక ముందే గ్రేటర్ నోయిడాలోని శారద యూనివర్సిటీలో దంద వైద్య విద్యార్థిని సూసైడ్ చేసుకుంది.
గోవా గవర్నర్‌గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.
కేరళలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఒక దివ్యాంగ ఖైదీ పరారయ్యాడు. ఉదయం తనిఖీలు చేస్తుండగా ఖైదీ మిస్ అయ్యాడు. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఖైదీ పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి.
ప్రజాస్వామ్యంలో ప్రమాదంలో ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. ఓ జాతీయ మీడియాతో సిద్ధరామయ్య మాట్లాడారు. ఎన్నికల సంఘం కేంద్రానికి తొత్తుగా వ్యవహరిస్తుందంటూ రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలకు సిద్ధరామయ్య మద్దతు తెలిపారు.