కేరళలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుంచి శుక్రవారం తెల్లవారుజామున ఒక దివ్యాంగ ఖైదీ పరారయ్యాడు. ఉదయం తనిఖీలు చేస్తుండగా ఖైదీ మిస్ అయ్యాడు. దీంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఖైదీ పారిపోతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో జైలు అధికారులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అత్యాచారం, హత్య కేసులో దోషిగా గోవిందచామి జీవితఖైదీ అనుభవిస్తున్నాడు. పైగా అతడికి ఎడమ చేయి లేదు. ఇక జైలు గోడ 25 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాకుండా విద్యుత్ కంచె ఉంది. ఇంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలు నుంచి ఎలా తప్పించుకోగలిగాడని తలలు పట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: Suspicious Death: అమావాస్య రోజు భర్తకు పాదపూజ చేసిన భార్య.. ఆ తర్వాత రోజే హత్య
ఇక రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, పోలీసులు విస్తృతంగా తనిఖీ చేయగా కొన్ని గంటల వ్యవధిలోనే దొరికిపోయాడు. ఇక గోవిందచామి రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు గుర్తుపట్టి కొందరు స్థానికులు పిలువగా పారిపోయాడు. అయితే కన్నూర్ సెంట్రల్ జైలు నుంచి దివ్యాంగ ఖైదీ ఎలా పారిపోయాడని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ఇప్పటికే డ్యూటీలో ఉన్న సిబ్బందిని సస్పెండ్ చేశారు. గోవిందచామి తప్పించుకోవడానికి సిబ్బంది ఏమైనా సాయం చేశారా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నరు. బట్టలతో చేసిన తాడుతో గోవిందచామి తప్పించుకున్నట్లు కనిపెట్టారు. తెల్లవారుజామున ఉదయం 4.15 నుంచి 6.30 గంటల ప్రాంతంలో తప్పించుకున్నట్లుగా కనుగొన్నారు. అయితే ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లుగా తెలుస్తోంది. ఉద్దేశ పూర్వకంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందా? లేదంటే సాధారణంగా నిలిచిపోయిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: మరోసారి అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రజాస్వామ్య నేతగా మోడీ రికార్డ్.. టాప్-5లో కనపడని ట్రంప్..!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందచామి సెల్‌లోని ఇనుప కడ్డీలను కత్తిరించడానికి బార్ కట్టర్‌ను ఉపయోగించినట్లుగా గుర్తించారు. గోడను స్కేల్ చేయడానికి తాడును తయారు చేయడానికి వస్త్రం, బెడ్‌షీట్‌లను ఉపయోగించాడు. అయితే ఎవరో సహాయం లేకుండా ఆరు మీటర్ల జైలు గోడను ఎలా ఎక్కగలిగాడని జైలు అధికారులకు అర్థం కావడం లేదు. గోవిందచామి చాలా రోజుల ముందుగానే తప్పించుకోవడానికి సిద్ధమయ్యాడని పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Trump: హమాస్ అంతం కావాల్సిందే.. పని పూర్తి చేయాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ సూచన
మంజక్కాడ్‌కు చెందిన 23 ఏళ్ల సౌమ్య అనే మహిళ ఫిబ్రవరి 1, 2011న ఎర్నాకుళం నుంచి షోర్నూర్‌కు ప్యాసింజర్ రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా గోవిందచామి అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేశాడు. ఈ కేసును దర్యాప్తు చేసిన త్రిస్సూర్‌లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టు 2012లో నిందితుడు గోవిందచామికి మరణశిక్ష విధించింది. 2014లో కేరళ హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది. 2016లో ఈ కేసుపై దర్యాప్తు చేసిన సుప్రీంకోర్టు నిందితుడికి విధించిన మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. నాటి నుంచి అతడు జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.