జమ్మూకాశ్మీర్‌లోని 35 ఏళ్ల క్రితం హత్యకు గురైన కాశ్మీరీ పండిట్ సరళా భట్(25) కేసుపై దర్యాప్తు సంస్థ దృష్టిపెట్టింది. మంగళవారం రాష్ట్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ కాశ్మీర్లో దాడులు చేపట్టింది.
ప్రధాని మోడీ దేశ హక్కులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎంతో గొప్ప విషయమని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అన్నారు. భారత్‌పై ట్రంప్ 50 శాతం సుంకం విధించడాన్ని రూబిన్ తీవ్రంగా తప్పుపట్టారు. మోడీ నిర్ణయం.. అమెరికాకు నిజమైన గుణపాఠం నేర్పుతుందని తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో రెండు నెలల్లో వీధి కుక్కలు లేకుండా చేయాలని సోమవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ప్రక్రియను ఎవరైనా అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జస్టిస్ జేబీ పార్దివాలా, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఘాటుగా హెచ్చరించింది. తక్షణమే ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులకు సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానాశ్రయంలో పార్క్ చేసిన విమానాన్ని మరో చిన్న విమానం ఢీకొట్టింది. దీంతో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. అయితే పైలట్ సహా ముగ్గురు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్ టార్గెట్ పార్కింగ్ స్థలంలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
ఆగస్టు 15న ట్రంప్-పుతిన్ సమావేశం అవుతున్నారు. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తు్న్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. చర్చలు ఫలించలేదు.
రష్యాతో సంబంధాలు పెట్టుకున్న దేశాలకు భారీ జరిమానాలు ఉంటాయని ట్రంప్ హెచ్చరించారు. ఇందలో భాగంగానే భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధించారు. ఇదే కోవలో చైనా కూడా ఉంది.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో విభేదాలు రచ్చకెక్కాయి. ఇప్పటికే సిద్ధరామయ్య- డీకే.శివకుమార్ వర్గాలు రెండుగా విడిపోయాయి. ముఖ్యమంత్రి మార్పును శివకుమార్ వర్గీయులు కోరుకుంటుంటే.. అందుకు సిద్ధరామయ్య ససేమిరా అంటుకున్నారు. సీటులోంచి దిగే ప్రసక్తేలేదని తేల్చి చెబుతున్నారు. ఈ పంచాయితీ ఇలా ఉంటుండగా తాజాగా కొత్త పంచాయితీ రచ్చ చేస్తోంది.
దేశ వ్యాప్తంగా కుక్కల బెడద పెరిగిపోయింది. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా మనుషులపై కుక్కల గుంపు దాడులు చేయడంతో ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఆయా రాష్ట్రాల్లో ఎక్కడో చోట జరుగుతూనే ఉంటున్నాయి. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నాయి. మనుషుల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి చేపట్టిన మార్చ్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీసుకు ర్యాలీ చేపట్టారు.