ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా సోమవారం ఢిల్లీలో ఇండియా కూటమి భారీ ర్యాలీ చేపట్టింది. పార్లమెంట్ భవన్ నుంచి ఈసీ ఆఫీస్‌కు మార్చ్ చేపట్టింది. విపక్ష ఎంపీలంతా ర్యాలీలో పాల్గొన్నారు.
ఎన్నికల సంఘంపై ఇండియా కూటమి యుద్ధానికి దిగింది. గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై విపక్షాలు ఆందోళనలు, నినసనలు కొనసాగిస్తున్నాయి. బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా విపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం ట్రంప్ సుంకాల కారణంగా బంగారం ధరలు కొండెక్కాయి. రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు పెరిగాయి. శ్రావణమాసంలో ధరలు పెరగడంతో కొనుగోలుదారులు హడలెత్తిపోయారు.
ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఎంపీల నివాస సముదాయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి మోడీ ఎంపీల ఫ్లాట్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు.
జగదీప్ ధన్ఖర్.. గత నెల 21న అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. అనారోగ్య కారణాలతో పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆనాటి నుంచి మళ్లీ ఎక్కడా ప్రత్యక్షం కాలేదు.
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఓక్సాకా తీరానికి సమీపంలో 5.65 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
అసిమ్ మునీర్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్. భారత్‌పై నిత్యం విషం కక్కుతూ ఉంటాడు. విదేశాల్లో స్థిరపడిన పాకిస్థానీయులను ఉద్దేశించి మాట్లాడుతూ భారత్‌పై రెచ్చగొట్టే ప్రసంగం చేసిన తర్వాతే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగింది.
గాజాను స్వాధీనం చేసుకోవాలని ఇజ్రాయెల్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీనిపై పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గాజాను స్వాధీనం చేసుకోమని.. హమాస్ అంతమే లక్ష్యమని నెతన్యాహు చెప్పుకొచ్చారు.