Shubhanshu Shukla: శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై పార్లమెంట్‌లో ప్రత్యేక చర్చ.. విపక్షాలు బాయ్‌కట్
- శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రపై ప్రత్యేక చర్చ
- పార్లమెంట్ నుంచి విపక్షాలు బాయ్‌కట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అమెరికా నుంచి శనివారం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్రమంత్రులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. తాజాగా సోమవారం పార్లమెంట్‌లో శుభాంశు శుక్ల అంతరిక్ష ప్రయాణంపై పార్లమెంటు ప్రత్యేక చర్చ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. పార్టీల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లాను గౌరవించడం పౌరులుగా బాధ్యత అన్నారు. ఈ సమయంలో రాజకీయాలను పక్కకు పెట్టాలని ప్రతిపక్ష నాయకులను కోరారు. ‘‘నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీకు ప్రభుత్వంపైనా… దేశం పట్ల గౌరవం లేకపోయినా… కనీసం అంతరిక్షంలోకి వెళ్లిన భారతీయుడి పట్ల గౌరవం చూపండి.’’ అని విపక్ష నాయకులను మంత్రి కోరారు. అలాగే కిరణ్ రిజుజు కూడా విజ్ఞప్తి చేశారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో పాల్గొన్నట్టుగా ఇప్పుడు కూడా పాల్గొనాలని కోరారు.
ఇది కూడా చదవండి: Pakistan: అసిమ్ మునీర్ వ్యాఖ్యలే రిపీట్ చేసిన పాక్ మంత్రి.. భారత్‌ను ఎలా పోల్చాడంటే..!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
వ్యోమగామి శుభాంశు శుక్లాపై లోక్‌సభలో జరిగిన ప్రత్యేక చర్చకు ప్రతిపక్షాలు దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్ మాత్రం సోషల్ మీడియా వేదికగా ప్రశంసలుు కురిపించారు. శుభాంశు శుక్లాను హీరోగా అభివర్ణించారు. గగన్‌యాన్‌కు ఒక మెట్టుగా పనిచేసిందని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mumbai Rains: జలదిగ్బంధంలో ఆర్థిక రాజధాని.. జనజీవనం అస్తవ్యస్తం
జూన్ 25న చేపట్టిన యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. రోదసిలో 18 రోజులు గడిపారు. శుభాంశు శుక్లా బృందం జులై 15న భూమికి తిరిగి వచ్చింది. వచ్చిన వెంటనే వ్యోమగాములను క్వారంటైన్ సెంటర్‌కు తరలించారు. ఇక సోమవారం మోడీతో భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈనెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో కూడా శుభాంశు శుక్లా పాల్గొంటారని వెల్లడించాయి.

తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!