Cloudburst: జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్.. ఏడుగురు మృతి
- జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ క్లౌడ్‌బరస్ట్
- ఏడుగురు మృతి.. పలువురికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ బీభత్సం సృష్టించింది. కథువాలో ఆకస్మిక వరదలు కారణంగా ఏడుగురు చనిపోయారు. జోధ్ ఘాటిలో వరదలు కారణంగా ఐదుగురు చనిపోతే.. జాంగ్లోట్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మరణించారు. అనేక మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. నేటి గోల్డ్ రేట్స్ ఇలా..!
Also Read
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- India-China Ties: ప్రధాని మోడీ ఒక్క ప్రకటనతో చైనాలో ఆనందం..
శనివారం-ఆదివారం మధ్య రాత్రి సమయంంలో ఈ క్లౌడ్ బరస్ట్ జరిగింది. ఒక్కసారిగా వరద ముంచుకొచ్చింది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఒక రైల్వే ట్రాక్, జాతీయ రహదారి-44, ఒక పోలీస్ స్టేషన్ కూడా తాజా వరదల్లో దెబ్బతిన్నాయని చెప్పారు. వెంటనే సైన్యం, పారామిలిటరీ దళాలు వెంటనే రంగంలోకి దిగి చర్యలు చేపట్టాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు కథువా సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.
ఇది కూడా చదవండి: UP: మీరట్‌లో దారుణం.. జవాన్‌ను స్తంభానికి కట్టేసి చావబాదిన టోల్ సిబ్బంది
ఇక మృతుల కుటుంబాలకు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. కథువా జిల్లాలో ప్రజలు సురక్షితంగా ఉండటానికి సహాయ, రక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
కథువా జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రజలు నదులు, వాగులు, నహల్లాలు, ఇతర నీటి వనరుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని.. ఇతర ప్రమాద ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.

ఇక ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌లో క్లౌడ్ బరస్ట్ కారణంగా ఆకస్మిక వరదలు సంభవించి 63 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు. ఆగస్టు 14న మచైల్ మాతా ఆలయానికి వార్షిక తీర్థయాత్ర కోసం చిసోటిలో పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడినప్పుడు ఈ విషాదం సంభవించింది. కనీసం 82 మంది ఇంకా ఆచూకీ తెలియలేదు. ఈ యాత్ర జూలై 25న ప్రారంభమై సెప్టెంబర్ 5న ముగియాల్సి ఉంది.
#IndianArmy Columns on the ground in #Kathua — rescuing families, giving hope, food & care after the #Cloudburst. @adgpi@westerncomd_IA@prodefencejammu@JmuKmrPolice pic.twitter.com/Z5K0uriQ7b
— Rising Star Corps_IA (@RisingStarCorps) August 17, 2025
తాజావార్తలు
-
Hyderabad Gold Ganesh Idol: చూడడానికి రెండు కళ్లు చాలవుగా.. 24 క్యారెట్ల గోల్డ్ ప్లేటింగ్, 3,83,800 అమెరికన్ డైమండ్లతో అద్భుత గణపయ్య..!
-
Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
OTT Releases: ఈ వారం ఓటీటీ లవర్స్ కు పండగే.. అదిరిపోయే హాలీవుడ్ కంటెంట్ సిద్దం
-
Honor Play 11 5G: వాటర్‌ప్రూఫ్ ఫోన్ లాంచ్.. 8,300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Honor Play 11
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్‌ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!