బ్రిటన్లో వందల రోజుల దగ్గు వ్యాధి కలకలం రేపుతోంది. దీన్ని అంటు వ్యాధిగా గుర్తించిన ఆరోగ్య నిపుణులు.. హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఈ వ్యాధి ముక్కు కారడం, గొంతు నొప్పితో మొదలై.. దగ్గు అధికమవుతుందని చెబుతున్నారు.
కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లా నేస్తం పథకం ద్వారా ఆర్థిక సాయం చేస్తోంది. ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ.1,80,000 స్టైఫండ్ అందిస్తోంది. ఇందులో భాగంగా.. 2023-24 గాను రెండో విడత సాయాన్ని ఇవాళ విడుదల చేయబోతోంది. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు సీఎం జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా నిధులు విడుదల…
తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా... మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో యువతలో దాగిఉన్న క్రీడలను వెలికితీసింది ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్.. అందులో భాగంగా క్రీడాకారుల కోసం టాలెంట్ సెర్చ్ పెడుతోంది.. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.. యువతలో క్రీడలను ప్రోత్సహించే విధంగా ఒప్పందాలు చేసుకుంటుంది.. 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది ఏపీ ప్రభుత్వం.
కేకే లైన్ డబుల్ లైన్గా మార్చబోతున్నాం.. దీంతో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. విజయనగరంలో మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ళ లో ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని.. సంక్షేమ కార్యక్రామాలు అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు.
విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉంది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామని.. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చాం.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తాం.. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నాం.. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం.. నా అదృష్టంగా భావిస్తున్నాను.. చంద్రబాబు, ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామని ప్రకటించారు తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని