ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్‌ను నియమించింది చంద్రబాబు సర్కార్.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు న్యాయ శాఖ కార్యదర్శి సత్య ప్రభాకర్ రావు.. బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.. కాగా, దమ్మాలపాటి శ్రీనివాస్.. ఆయన అడ్వకేట్ జనరల్‌గా పనిచేయడం ఇది తొలిసారి కాదు.. 2014 నుంచి 2019 వరకు ఏజీగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి.. కూటమి ప్రభుత్వం ఏర్పడడం.. మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో ఏజీ పదవి మళ్లీ దమ్మాలపాటి శ్రీనివాస్‌కే దక్కుతుందనే ప్రచారం సాగుతూ వచ్చింది.. దానికి అనుగుణంగా.. ఇతర పేర్లు పరిశీలనలోకి వచ్చినా.. దమ్మాలపాటి వైపే చంద్రబాబు మొగ్గుచూపారట.. ఇక, గతంలో టీడీపీ సర్కార్ హయాంలో దమ్మాలపాటిపై, ఆయన కుటుంబ సభ్యులపై రాజధాని భూముల విషయంలో కేసులు పెట్టారు.. ఆ కేసులను తానే వాదించుకన్న దమ్మాలపాటి.. ఇతర కేసుల్లో టీడీపీ కీలక నేతలపై నమోదైన కేసులను కూడా ఆయనే వాదిస్తూ వచ్చారు.. ఇప్పుడు ఆయన్నే ఏజీగా నియమించారు సీఎం చంద్రబాబు నాయుడు.