ఏపీ గవర్నర్కు లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. రాష్ట్ర ప్రభుత్వ ఈ -ఆఫీస్ అప్ గ్రేడ్ వ్యవహారం నిలిపేయాలని గవర్నర్ను లేఖ ద్వారా కోరారు చంద్రబాబు.. ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు అప్ గ్రేడ్ పేరుతో ఈ ఆఫీస్ మూసివేతపై అనుమానాలు వ్యక్తం చేశారు చంద్రబాబు.. మరికొద్ది రోజుల్లో కొత్త ప్రభుత్వం వస్తున్న తరుణంలో ఇప్పటికిప్పుడు ఈ ఆఫీస్ అప్ గ్రేడియేషన్ అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన ఆయన.. పారదర్శకత పాటించని ఈ ప్రభుత్వంలో ఈ-ఆఫీస్…
ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం ఈ విచారణ జరిపింది.. ఇసుక అక్రమ మైనింగ్ పై కీలక ఆదేశాలు వెలువరించింది సుప్రీంకోర్టు.. అక్రమ మైనింగ్ నిరోధానికి ప్రతి జిల్లాలో అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.. కలెక్టర్, పోలీసులు, అధికారులు ఈ కమిటీలో ఉండాలని.. అక్రమ మైనింగ్ ఆపడానికి చర్యలు తీసుకోవాలని.. అలాగే కమిటీ రెగ్యులర్ గా మైనింగ్ ప్రాంతాలు సందర్శించాలని.. ప్రతి జిల్లాలో ఈ కమిటీ ఉండాలని స్పష్టం చేసింది..
గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద సీఎం సెక్యూరిటీ సిబ్బంది పార్టీ నిర్వహించడంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకి ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ఈ మేరకే ఏపీ సీఈవోకు లేఖ రాసిన ఆయన.. నాగార్జున యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన సీఎం సెక్యూరిటీ సిబ్బంది.. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా సిద్ధం పోస్టర్తో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీజే పాటలతో పార్టీ నిర్వహించారని.. ఈ…