Nara Bhuvaneshwari: ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కు అభినందనలు తెలుపుతూ.. భావోద్వేగానికి గురయ్యారు నారా భువనేశ్వరి.. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తనయుడు లోకేష్ కు అభినందనలు తెలిపిన ఆమె.. అప్పగించిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తావనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యను మెరుగుపరచి, ఐటీ సామర్థ్యాన్ని పెంచేందుకు కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. ప్రజా సేవ చేస్తూనే రాష్ట్రాన్ని సుభిక్ష మార్గంలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని కోరుకుంటున్నాను అని.. పదవీకాలం విజయవంతంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నా అని తన ప్రకటనలో పేర్కొన్నారు.
Read Also: Akkada Ammayi Ikkada Abbayi: అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఇన్నాళ్లకు కలిశారు!
ఇక, ఆంధ్ర ప్రదేశ్‌లో మహిళలు గతంలో న్యాయం కోసం ఎదురు చూడాల్సి వచ్చేది.. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పరిస్థితి మారిపోయింది అన్నారు భువనేశ్వరి.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఇక తగ్గినట్లే అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. చీరాల ఘటనలో త్వరితగతిన చర్యలు తీసుకున్న హోంమంత్రి అనిత, పోలీస్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.. మహిళల భద్రత పట్ల మీ నిబద్ధత భవిష్యత్తులోనూ కొనసాగుతుందని నేను విశ్వసిస్తున్నాను అని పేర్కొన్నారు నారా భువనేశ్వరి. కాగా, సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కీలకంగా పనిచేసిన నారా లోకేష్.. తాను మంగళగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి భారీ మెజార్టీతో విజయం సాధించారు.. ఇక, చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన మానవవనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖలు దక్కించుకున్నారు నారా లోకేష్.. సచివాలయం 4వ బ్లాక్ రూమ్ నెం.208లోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్‌ని.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఉద్యోగ- విద్యార్థి సంఘాల నేతలు అభినందించారు.