ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల తర్వాత జరుగుతున్న గొడవలకు ఎన్నికల సంఘం వైఫల్యమే కారణమన్నారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసు అధికారులను ఎన్నికల ముందే బదిలీ చేశారన్నారు. ఈసీ నియమించిన పోలీసు అధికారులు... గొడవలను అరికట్టలేకపోతే... బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు సజ్జల. ఏపీలో ఏకపక్షంగా దాడులు జరుగుతున్నాయన్నారు.
మరోసారి అధికారంలోకి రాబోతున్నాం.. వైసీపీ శ్రేణులు విజయోత్సవ సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్రంతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని దుయ్యబట్టారు.. కూటమి గెలుస్తుందంటూ మావాళ్లను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారన్న ఆయన.. జూన్ 4వ తేదీన వైసీపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు..
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎస్ జవహర్ రెడ్డితో అత్యవసరంగా సమావేశం అయ్యారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా.. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కూడా పాల్గొన్నారు.. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతర హింసాత్మక ఘటనలపై సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) సీరియస్ కావటం.. ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. ఈ అత్యవసరం భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది..
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల తరుణంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై సీరియస్ అయ్యింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) ఏపీలో ఎన్నికల నిర్వహణ, పోల్ అనంతర హింసపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఈసీ.. సున్నిత ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతాయన్న సమాచారం ఉన్నా.. ఎందుకు ఈ స్థాయిలో హింస చేలరేగుతోందని మండిపడింది.
ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ భారీగా నమోదు అవుతోంది.. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ శాతం 70 శాతానికి చేరువగా వెళ్లింది.. 5 గంటల వరకు 67.99 శాతం పోలింగ్ నమోదు అయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది..
తెనాలి ఐతానగర్లో నా భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఈ రోజు ఉదయం వెళ్లాం అని తెలిపిన అన్నాబత్తుని శివకుమార్.. ఎమ్మెల్యేగా మాల మాదిగ సామాజిక వర్గాలకు కొమ్ముకాస్తున్నావంటూ గొట్టిముక్కల సుధాకర్ అనే వ్యక్తి నానా దుర్భాషలాడాడు.. నా భార్య ముందే నన్ను అసభ్యంగా దూషించాడు. బూత్లోకి వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడూ దుర్భాషలాడుతూనే ఉన్నాడు అని మండిపడ్డారు.