ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వస్తారు? అనేదానిపై ఎవరి అంచనాలు వారికున్నాయి.. ఇదే సమయంలో.. బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.. అధికారంలోకి వచ్చే పార్టీ ఏది? అని మొదలుకొని.. కీలక నేతలు పోటీ చేసే స్థానాల్లో గెలుపు ఓటములతో పాటు.. మెజార్టీలపై బెట్టింగ్ కాస్తున్నారు.. అయితే, ఇప్పుడు ఈ జాబితాలోకి నేతలు సైతం చేరుతున్నారు.. కర్నూలు జిల్లా కోసిగి జడ్పీటీసీ మంగమ్మ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు..
పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలు ముగిశాయి.. పోస్టల్ బ్యాలెట్ పై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే కాగా.. ఆ పిటిషన్‌పై హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి.. అయితే, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు..
ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ పర్చేజ్ కమిషనర్ ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది. అయితే, ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీ హోదా ఏబీ వెంకటేశ్వరరావు ఈ రోజు పదవీ విరమణ చేశారు. ఏబీవీకి శుభాకాంక్షలు తెలిపి ఘనంగా వీడ్కోలు పలికారు అభిమానులు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ఈ రోజు సాయంత్రం.. కాపు రామచంద్రారెడ్డి, సాధినేని యామిని శర్మ, బిట్ర శివన్నారాయణ, పాతూరి నాగభూషణం తదితర నేతలతో రాజ్‌భవన్ వెళ్లిన ఆమె.. గవర్నర్‌ను కలిసి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలు ప్రకటించాలని కోరుతూ గవర్నర్‌కు లేఖ అందించారు..
సోషల్ మీడియా యాప్‌లో రోజుకో కొత్త ఫీచర్‌తో సత్తా చాటుతున్నాయి.. వినియోగదారుల ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.. అయితే, ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా గూగుల్ తన యాప్‌ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేపనిలో పడిపోయింది..