CM Chandrababu Naidu: రేపు తాడిగడపకు సీఎం చంద్రబాబు..
- రేపు కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తాడిగడపలో రామోజీరావు సంస్మరణ సభ..
- పాల్గొననున్న సీఎం చంద్రబాబు..
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు.. పెనమలూరు మండలం తాడిగడపలో నిర్వహించనున్న రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు సంస్మరణ సభలో పాల్గొననున్నారు.. పెనమలూరు మండలంలోని తాడిగడప.. రామోజీరావు స్వగ్రామం అయిన విషయం విదితమే.. క్రమంగా ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించినా.. ఏ నాడూ సొంత ఊరిని మరవకుండా.. అభివృద్ధి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు రామోజీరావు.. ఇక, తాడిగడపలో నిర్వహించే రామోజీ రావు సంస్మరణ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.. రామోజీతో తనకు ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తుచేసుకోనున్నారు.. మరోవైపు.. రేపటి సభా ఏర్పాట్లను మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యాకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి పరిశీలించారు.. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన దాదాపు 7 వేల మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్టు మంత్రి పార్థసారథి వెల్లడించారు.. ఇక, రామోజీరావు పుట్టిన జిల్లాల్లో తాను పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు మంత్రి పార్థసారథి. ఇక, దివంగత రామోజీరావు సంస్మరణ సభను రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం.. మీడియా, సినీ రంగాలతో పాటు సమాజానికి ఆయన చేసిన విశేష సేవలకుగాను ఆయన గౌరవార్థం సంస్మరణ సభను నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.
Read Also: Deputy CM Pawan Kalyan: ఉన్నది రూ.7 కోట్లేనన్న అధికారులు.. ఆశ్చర్యపోయిన డిప్యూటీ సీఎం పవన్..
Also Read
తాజావార్తలు
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!