కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో సమావేశమైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కీలక అంశాలపై చర్చించారు.. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్ర శేఖర్, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కృష్ణ ప్రసాద్, అప్పలనాయుడు, హరీష్ బాలయోగి, సానా సతీష్ తదితరలు పాల్గొన్నారు..
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు కాసేపట్లో విడుదల కాబోతున్నాయి.. తెలంగాణ ఇంటర్ ఫస్టియర్తో పాటు సెకండియర్ ఫలితాలను కూడా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విడుదల చేయనున్నారు..
లిక్కర్ స్కామ్పై సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి.. ''ఏపీ లిక్కర్ స్కామ్లో నా పాత్ర విజిల్ బ్లోయర్ మాత్రమేనని పేర్కొన్నారు.. తప్పించుకునేందుకే దొరికిన దొంగలు, దొరకని దొంగలు కూడా నా పేరుని లాగుతున్నారని మండిపడ్డ ఆయన.. ఏ రూపాయి నేను ముట్టలేదు.. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు.. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను''
సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులును అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు.. ముంబై హీరోయిన్ కాదంబరి జత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులును.. ఇవాళ ఉదయం బేగంపేటలోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తరలించారు.. సాయంత్రంలోగా పీఎస్సార్ ఆంజనేయులును అరెస్ట్ చేసినట్టు అధికారికంగా చూపే అవకాశం ఉంది..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం డెడ్లైన్ మారిపోయింది.. మరో ఆరు నెలల ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.. గోదావరి పుష్కరాల నేపథ్యంలో 2027 జూన్ నాటికే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని అనుకుంటున్నామని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
క్రికెట్ గ్రౌండ్లోనే గుండె ఆగి.. యువకులు చనిపోయిన సందర్భాలు లేకపోలేదు.. అలాంటి ఘటన ఇప్పుడు పల్నాడు జిల్లాలో జరిగింది.. జిల్లాలోని వినుకొండలో క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురైన గౌస్ బాషా అనే యువకుడు కుప్పకూలిపోయాడు.. అయితే, వెంటనే ఆస్పమత్తమైన తోటి క్రికెటర్లు.. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు గౌస్ భాష..
కూటమి ప్రభుత్వంలో తీసుకుంటున్న ప్రతి చర్యతో మాజీ సీఎం వైఎస్ జగన్కు జ్ఞానోదయం కలగాలని వ్యాఖ్యానించారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. పార్వతిపురం మన్యం జిల్లాలో అంబేద్కర్ జయంతి వారోత్సవాల్లో పాల్గొన్న ఆయన.. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. విశాఖలో మేయర్ గా కుటమి అభ్యర్థి విజయం సాధించారు.. జగన్మోహన్ రెడ్డి దీనిపై మాట్లాడుతూ రాష్ట్రంలో గడ్డు పరిస్థితి ఏర్పడిందని విమర్శించడం దారుణం అన్నారు.