YSR Jayanthi 2025: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 76వ జయంతి సందర్భంగా.. తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు.. ఇక, ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. అనంతరం నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం తల్లి విజయమ్మను ప్రేమగా పలకరించారు జగన్.. ఈ సందర్భంగా జగన్ ను ఆశీర్వదించారు తల్లి విజయమ్మ.. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలలో వైఎస్ కుటుంబ సభ్యులు.. ఉమ్మడి కడప జిల్లాలోని వైసీపీ నేతలు.. అభిమానులు ఇలా పెద్ద ఎత్తున తరలివచ్చారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు.. వైఎస్ జగన్, విజయమ్మ సహా కుటుంబ సభ్యులు.. వైసీపీ నేతల నివాళులని వీక్షించేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..