Nimmala Ramanaidu: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కృష్ణాజిల్లా గుడివాడ.. గుడ్లవల్లేరులో మీడియాతో మాట్లాడిన నిమ్మల రామానాయుడు.. మామిడికాయలకు.. తలకాయలకు తేడా తెలియని వ్యక్తి జగన్ అని ఎద్దేవా చేశారు.. వై నాట్ 175 లాంటిదే.. జగన్ 2.0 కూడా అంటూ సెటైర్లు వేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు చేసే మంచిని చెప్పాలి… 2 కన్ను పీకేస్తాం.. కాలు తీసేస్తాం.. రప్పా రప్పా అంటూ నరికేస్తామంటే కుదురుతుందా..? అని ప్రశ్నించారు.. జగన్ ముఠా లూటీల సొమ్ము దొరకడంతో… ఆందోళన మొదలైందన్నారు.. ఇక, జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు.. సంఘ విద్రోహ శక్తులు, ఉగ్రవాదుల మాదిరి జగన్ ప్రవర్తిస్తున్నారు.. విధ్వంసం సృష్టించేందుకే.. పరామర్శల ముసుగులో జగన్ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు..
Read Also: WhatsApp Guest Chat: వాట్సాప్ లో మరో క్రేజీ ఫీచర్.. యాప్ లేకుండానే యూజర్లతో చాట్!
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి వైఎస్ జగన్ కు భయం పట్టుకుందన్నారు నిమ్మల రామానాయుడు.. మునిగిపోతున్న వైసీపీ నావను కాపాడుకోవడానికే.. జగన్ ఆరాటమంతా..! 2024లో జగన్ నుండి.. ఏపీ ప్రజలు విముక్తి పొందారు.. బ్రిటిష్ పాలన కంటే దారుణంగా ఉండే.. అసలు జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు కోరుకుంటారు..? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో 11 సీట్లు కూడా రావని భావనతో.. రాష్ట్రంలో అశాంతి, అరాచకం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.. అధికారంలో ఉన్నన్నాళ్లు తాడేపల్లి కొంప దాటి బయటికి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? అని నిలదీశారు.. ఇక, విధ్వంసం సృష్టించేందుకే పరామర్శల పేరుతో పర్యటిస్తున్నారు అంటూ వైఎస్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు..