-
కొత్త లిక్కర్ పాలసీ.. రూ.1200 కోట్లు టార్గెట్..!
కొత్త లిక్కర్ పాలసీపై దృష్టి పెట్టింది తెలంగాణ సర్కార్. జీఎస్టీ తర్వాత ఖజానాకు అధిక ఆదాయం ఎక్సైజ్ శాఖ నుంచే వస్తోంది. దీంతో ఈ ఏడాది మద్యం అమ్మకాలు, షాపుల వేలం ద్వారా ఈ ఏడాది దాదాపు 12 వందల కోట్ల రూపాయలు ఆర్జించాలని తెలంగాణ ఎక్స్జైజ్ శాఖ టార్గెట్ గా పెట్టుకుంది. తాజా లెక్కల ప్రకారం ఖజానాకు ఏటా 24 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుండటంతో.. మద్యం అమ్మకాలపై మరింత ఫోకస్ పెడుతోంది తెలంగాణ […] -
వైఎస్ వివేకా కుమార్తె లేఖపై స్పందించిన ఎస్పీ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. నిందితుల ఇళ్లలోనే వివేకా హత్యకు వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్న అధికారులు ఇవాళ పలువురు స్థానిక నేతలను ప్రశ్నించారు.. మరోవైపు.. తమ ప్రాణాలకు ముప్పు ఉందని వైస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి కడప జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు. ఆ తర్వాత సునీత లేఖపై స్పందించారు కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్.. సునీత కుటుంబ రక్షణ కోసం చర్యలను చేపట్టామని […] -
మళ్లీ పంజా విసురుతోన్న కోవిడ్.. ఒకేరోజు 10 వేల మందికి పైగా మృతి
కరోనా సెకండ్ వేవ్ భారత్‌లో కాస్త తగ్గుముఖం పట్టింది.. కొన్ని దేశాలు మినహా ప్రపంచవ్యాప్తంగా కూడా కోవిడ్ కేసులు తగ్గుతూ వచ్చినట్టే వచ్చి.. మళ్లీ పంజా విసురుతున్నాయి… ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందనే హెచ్చరికలు ఓవైపు ఆందోళన కలిగిస్తుండగా.. ఇప్పుడు మళ్లీ పాజిటివ్ కేసులు పెరగడం.. మృతుల సంఖ్య కూడా క్రమంగా పైకి కదులుతుండడంతో మళ్లీ కలవరం మొదలైంది.. తాజా గణాకాంల ప్రకారం.. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 7 లక్షల […] -
స్కూల్ ఫ్రెండ్‌ను అంటూ పరిచయం.. గిఫ్ట్‌ల పేరుతో భారీ మోసం
సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు.. ఏది చెబితే అవతలి వ్యక్తి బుట్టలో పడతాడో.. మరీ గెస్‌చేసి ఊబిలోకి లాగేస్తున్నారు.. ఆ తర్వాత అందినకాడికి దండుకుంటున్నారు.. తాజాగా హైదరాబాద్‌లో స్కూల్ ఫ్రెండ్‌ను అంటూ ఏకంగా రూ.14 లక్షలు మోసం చేశారు సైబర్ నేరగాళ్లు.. దీనికి సోషల్ మీడియాను వాడుకున్నారు.. ఇన్స్టాగ్రామ్ లో స్కూల్ ఫ్రెండ్‌ని అంటూ హైదరాబాద్‌కు చెందిన మహిళతో పరిచయం చేసుకున్న.. కేటుగాడు.. మీకు గిఫ్ట్‌లు పంపిస్తానంటూ నమ్మబలికాడు.. ల్యాప్‌టాప్, విలువైన గిఫ్ట్స్, […] -
బోగస్ చలనాల స్కామ్.. డాక్యుమెంట్ రైటర్లపై ఫోకస్..
ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా బోగస్ చలనాలా స్కామ్ వెలుగు చూసింది.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వానికి చెల్లించే ఫీజు విషయంలో జరిగిన బోగస్ చలనాల కుంభకోణాన్ని సీరియస్‌గా తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇప్పటికే ఈ వ్యవమారంపై ఆరా తీశారు సీఎం వైఎస్ జగన్.. మరోవైపు.. ఈస్కామ్‌తో డాక్యుమెంట్ రైటర్లపై ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం.. డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సింగ్ విధానాన్ని తెచ్చే అంశంపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ సమాలోచనలు చేస్తోంది.. బోగస్ చలానా స్కామ్‌లో డాక్యుమెంట్ రైటర్లదే […] -
దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దు..!
హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో దళిత బంధు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ప్రభుత్వం.. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ పథకం అమలు చేయాలని దళిత బంధు పథకంపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో నిర్ణయించారు సీఎం కేసీఆర్.. అయితే, దళిత బంధుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు వద్దు అని చెబుతున్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దళిత బంధు ఆపించే కుట్రలు జరుగుతున్నాయని.. దళిత బంధు అమలు అయితే […] -
కోవిడ్ వ్యాక్సిన్.. భారత్ బయోటెక్ మరో ముందడుగు
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక అవకాశం వ్యాక్సినేషన్.. అయితే, భారత్‌లో టీకా మాత్రమే మొదట అందుబాటులోకి వచ్చింది.. ఆ తర్వాత పౌడర్ రూపంలో కూడా మరో మందు మార్కెట్లోకి వచ్చింది.. ఇక, త్వరలోనే ముక్కు ద్వారా వ్యాక్సిన్ పొందవచ్చు.. ఎందుకంటే… కరోనా టీకా విషయంలో భారత్ బయోటెక్ సంస్థ మరో ముందడుగు వేసింది… ముక్కు ద్వారా వేసే కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి లభించింది.. భారత్ బయోటెక్ రూపొందించిన ముక్కు […] -
దళితబంధుపై సీఎం కీలక నిర్ణయం.. 16 నుంచే అమలు..
దళిత బంధు అమలుకు సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం.. ఇప్పటికే సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఈ పథకాన్ని అమలు చేస్తున్న సర్కార్.. పైలట్ ప్రాజెక్టుగా ముందు హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.. ఈ నెల 16వ తేదీ నుంచి హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేయాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. దళిత బంధు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం.. 16వ తేదీ నుంచి ఆ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.. ఇక, ఇప్పటికే హుజూరాబాద్ […] -
ట్విట్టర్ ఇండియా ఎండీపై బదిలీ వేటు..!
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్, భారత్ మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తూనే ఉన్నాయి… కేంద్రం తీసుకొచ్చిన కొత్త పాలసీ ఆమోదం విషయంలోనూ పెద్ద రచ్చే జరిగింది.. ఇక, కేంద్ర ప్రభుత్వంలోని పెద్దల నుంచి బీజేపీ నేతల వరకు పలువురు ఖాతాలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు మొదట్లో ఆరోపణలు రాగా.. ఈ మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలకు కూడా ట్విట్టర్ సెగ తగిలింది.. ఈ తరుణంలో ఓ ఆసక్తికరమైన పరిణామం జరిగింది.. ట్విట్టర్ ఇండియా ఎండీపై బదిలీ వేటు […] -
గుడ్‌న్యూస్.. పెట్రోల్ ధర భారీ తగ్గింపు.. అక్కడ మాత్రమే..
వరుసగా పెరుగుతూ పోయిన పెట్రోల్ ధరలు సామాన్యులకు భారంగా మారాయి… దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర సెంచరీ ఎప్పుడో కొట్టేస్తే… డీజిల్ ధర కూడా కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల్లో వంద దాటేసింది.. అయితే, తమిళనాడు ప్రజలకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆ రాష్ట్ర ప్రభుత్వం.. పెట్రోల్‌పై రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులను తగ్గించనున్నట్టు తమిళనాడు ఆర్థికమంత్రి పీ తియగ రాజన్ వెల్లడించారు.. దీంతో రాష్ట్రంలో లీటరు పెట్రోల్ పై మూడు రూపాయలు తగ్గుతుందని తెలిపారు. అయితే, ఈ […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!