ఉత్తరప్రదేశ్‌లోని సీఎం యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మరో కీల నిర్ణయం తీసుకుంది.. శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం విధించింది… బృందావన్-మధురతో పాటు.. వాటికి 10 కిలోమీటర్ల పరిధిలో మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింనట్టు యోడీ సర్కార్ పేర్కొంది.. ఇక, ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది ప్రభుత్వం.. మధుర, బృందావన్‌ను టూరిస్ట్ ప్లేస్‌లుగా ప్రకటించడంతో.. అక్కడ మద్యం, మాంసంపై నిషేధం విధించామని.. ఇప్పటి వరకు ఆ వృత్తుల్లో ఉన్న వారికి ప్రత్యామ్నాయం చూపించే విధంగా చర్యలు తీసుకుంటామని.. నిషేధం అమలును ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తారని వెల్లడించారు సీఎం యోగి ఆదిత్యానాథ్. ఇక, ఇప్పటి వరకు మద్యం, మాంసం విక్రయించినవారు ఇకపై పాలు విక్రయించవచ్చునని కూడా సూచించారు.