రాష్ట్రంలో ప్రతీ పేద కుటుంబానికి సొంతిళ్లు ఉండాలని... ఇందుకోసం తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి... వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీరుపై సీరియస్గా స్పందించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. అటవీశాఖ సిబ్బందితో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వివాదంపై ఆరా తీసిన సీఎం.. అధికారులతో మాట్లాడి ఘటనపై వివరాలు తెలుసుకున్నారు.. ఉద్యోగులతో ఘర్షణ వ్యవహారంలో ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. వివాదాలకు ఆస్కారం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.. అయితే, తప్పు ఎవరిదైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు..
గండికోటలో జరిగిన మైనర్ బాలిక హత్య కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. లైవ్ డిటెక్టర్ పరీక్ష కు సిద్ధం కావాలని వైష్ణవి కుటుంబ సభ్యులకు పోలీసులు నోటీసు జారీ చేశారు.. దారుణ హత్యకు గురైన మైనర్ బాలికకు అన్న వరుస అయ్యే కొండయ్య, సురేంద్ర, బాలిక ప్రియుడు లోకేష్ కు నోటీసులు ఇచ్చారు పోలీసులు.. ఈనెల 26వ తేదీన జమ్మలమడుగు కోర్టుకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే, వీరికి హైదరాబాద్లో లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు పోలీసులు.
నీటికుంటలో పడి ఆరుగురు స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. ఆస్పరి మండలం చిగిలిలో ఈ ఘటన విషాదాన్ని నింపింది.. స్కూల్ కి వెళ్లిన విద్యార్థులు స్కూల్ వదిలిన తరువాత సమీపంలో నీటి కుంటకు ఆడుకునేందుకు వెళ్లారు.. నీటికుంటలో ఆడుకుంటూ జారిపడి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు. మృతులు శశికుమార్, కిన్నెరసాయి, సాయి కిరణ్, భీమ, వీరేంద్ర, మహబూబ్ గా గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆన్లైన్లోనే గణేష్ ఉత్సవాలకు అనుమతి ఇస్తోంది.. దీని కోసం ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించింది.. సింగిల్ విండో విధానంలో ఆన్లైన్లోనే అన్ని అనుమతులు పొందేలా ఏర్పాట్లు చేసింది..
గుంటూరు జిల్లాలో ఓ ఎస్సై గుండెపోటుతో మృతిచెందాడు.. తుళ్లూరు ట్రాఫిక్ ఏఎస్సైగా పనిచేస్తున్న రవీంద్ర.. ఈ రోజు మందడంలో విధులు ముగించుకుని కారు డ్రైవ్ చేస్తూ గుంటూరు వెళ్తుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు.. తుళ్ళూరు దాటగానే ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో కారు ఆపారు రవీంద్ర. కొద్దిసేపటికే కారులోనే ప్రాణాలు కోల్పోయాడు..
తాజాగా మరో టీడీపీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు.. శ్రీశైలం శిఖరం చెక్ పోస్ట్ వద్ద ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరుల దాడి చేశారంటూ ఫారెస్ట్ సిబ్బంది ఆరోపిస్తున్నారు.. రాత్రి శిఖరం చెక్ పోస్ట్ దగ్గర తన వాహనాన్ని ఆపి హంగామా చేశారని.. శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు దాడి చేశారంటున్నారు ఫారెస్ట్ బీట్ సిబ్బంది.
వర్షం దాటికి రెండు వేర్వేరు గ్రామాలలోని పాఠశాలల్లో ఆ భవనాలకు సంబంధించి పెచ్చులు ఓవైపు, వర్షపునీరు మరోవైపు.. కిందపడుతోంది.. పెచ్చులు ఊడుతుండడంతో ఆ భవనం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి.. భయంతో స్కూల్కు రావాలంటేనే విద్యార్థులు వణికిపోతుంటూ.. ఒక గ్రామానికి చెందిన పాఠశాల పిల్లలను పీర్ల కొట్టానికి (ముస్లింలు పీర్లను పెట్టే ప్రదేశం) సంబంధించిన రేకుల షెడ్డులో పాటలు చెబుతుంటే.. మరో గ్రామంలో గణేష్ మండపంలో పాటలు చెబుతున్నాడు ఉపాధ్యాయులు.