ఇటు బీజేపీలో, అటు ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ 75 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. నాగ్ పూర్ లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా.. ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
జూన్ 21వ రాయుడును అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన, మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి, మాకు ఎన్నో రకాలుగా ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగించాడని.. దాంతో, రాయుడును పని నుండి తొలగించినట్టు వెల్లడించారట వినూత, చంద్రబాబు దంపతులు..
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంఛార్జ్గా ఉన్న వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది.. ఆమెపై చెన్నైలో హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి.. ఈ క్రమంలో వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది..
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ముందు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి హాజరుపై సస్పెన్స్ కొనసాగుతోనే ఉంది.. తాజా నోటీసుల ప్రకారం.. సిట్ ముందు నేడు విజయసాయిరెడ్డి హాజరుకావాల్సి ఉండగా.. తనకు ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలు ఉండటం కారణంగా ఇవాళ విచారణకు రాలేనని విజయసాయి రెడ్డి సిట్ అధికారులకు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన ట్వీట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రజలు తమ సమస్యలను స్వేచ్చగా చెప్పుకుని ప్రభుత్వం నుండి సమాధానం కోరుకునే అవకాశం ఉండాలి.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య ప్రాథమిక హక్కులు భంగం కలుగుతోంది.. చంద్రబాబు నిరంకుశ పాలనలో అడ్డగోలుగా అణచివేయపడుతోంది. పోలీసులతో అధికార దుర్వినియోగం చేయిస్తూ అసమ్మతి గళాలను నులిమేస్తున్నారు.. పోలీసు…
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అన్యమతస్థ ఉద్యోగుల అంశం చిచ్చు కొనసాగుతూనే ఉంది.. నిన్నటి రోజున శ్రీవారిని దర్శించుకున్న అనంతరం.. టీటీడీలో వున్న వెయ్యి మందికి పైగా అన్యమతస్థులను సాగనంపాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వాఖ్యలు దుమారం రేపగా.. దీనిపై కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. అసలు, టీటీడీలో వెయ్యి మంది అన్యమతస్థ ఉద్యోగులు వున్నారని ఏ ప్రాతిపదికన.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ వాఖ్యలు చేశారని ప్రశ్నించారు…
సీఎం చంద్రబాబు ఓ మూడేళ్ల చిన్నారి కోరిక తీర్చాడు.. ఆ కుటుంబంలో ఆనందం నింపారు.. ఇక, ఆ చిన్నారి ఆనందానికి అవదులు లేవనే చెప్పాలి.. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ నిర్వహించిన విషయం విదితమే కాగా.. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రత్యేక కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రితో కలిసి పాల్గొన్నారు సీఎం చంద్రబాబు.. అయితే, ఈ సందర్భంగా కొత్తచెరువులో మూడేళ్ల చిన్నారి ముఖ్యమంత్రి చంద్రబాబును ఓ కోరిక కోరగా.. ఆ మరుసటి రోజే.. ఆ చిన్నారి కోరిక…
చెన్నైలోని సమీపంలోని కూవం నదిలో కాళహస్తికి చెందిన యువకుడు రాయుడు మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.. కాళహస్తి గోడౌన్లో రాయుడు అనే యువకుడిని చిత్రహింసలకు గురి చేసి హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.. ఈ హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు తమిళనాడు సెవెన్ వెల్స్ పోలీసులు.. అయితే, అరెస్ట్ అయిన వారిలో కాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జ్ వినూత.. ఆమె భర్త చంద్రబాబు సహా ఐదుగురు ఉన్నారు..
కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు. రప్పా రప్పా అనేది మెయిన్ కాదని..…