Gold Medal Prisoner: జైల్లో స్టూడెంట్ నెం.1.. గోల్డ్ మెడల్ కొట్టిన జీవిత ఖైదీ..
- హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదికి గోల్డ్ మెడల్..
- దూరవిద్య ద్వారా 4 డిగ్రీలు.. మూడు ఎంఏలు పూర్తి..
- తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Medal Prisoner: కొన్ని సినిమాల్లో చూస్తుంటాం.. బాల్యం నుంచి జైలు జీవితం గడిపిన హీరో.. అక్కడే నుంచి పరీక్షలు రాసి మంచి మార్కులు సాధిస్తాడు.. ఇంకా కొందరు హీరోలు అయితే.. ఆ సినిమాల్లో జైలు అధికారుల అనుమతితో కాలేజీకి సైతం వెళ్లి చదువుకుంటారు.. అయితే, ఇప్పుడు కడప జైలులో ఓ స్టూడెంట్ నంబర్ వన్ ఉన్నాడు.. ఇప్పుడు ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడు.. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న జీవిత ఖైదికి గోల్డ్ మెడల్ వరించింది.. జైలు జీవితాన్ని గడుపుతూనే దూరవిద్య ద్వారా నాలుగు డిగ్రీలు సాధించాడు ఆ యువకుడు… అంతేకాకుండా మూడు ఎంఏలు పూర్తి చేశాడు… తాజాగా, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్‌కు ఎంపికయ్యాడు యుగంధర్ అనే ఖైదీ.. పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ సబ్జెక్టులుగా బీఏ పూర్తి చేశాడు. ఇందులో 8.02 జీపీఎస్ సాధించి గోల్డ్ మెడల్ కు ఎంపికయ్యారు…
Read Also: Jogi Ramesh: బాలయ్య వ్యాఖ్యలపై జోగి రమేష్ కౌంటర్ ఎటాక్..
Also Read
ఈనెల 30వ తేదీన హైదరాబాద్‌లో జరిగే యూనివర్సిటీ 26వ నేతకోత్సవంలో గోల్డ్ మెడల్ అందుకోవాలని యూనివర్సిటీ నుంచి యుగంధర్ కు ఆహ్వానం అందింది.. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం జంగాలపల్లికి చెందిన యుగంధర్ కు ఓ హత్య కేసులో 2011లో జీవిత ఖైదు శిక్ష పడింది. ఆయన కడప కేంద్ర కరాగారంలో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా దాదాపు 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్న తన కుమారుడు యుగంధర్ కు క్షమాభిక్ష పెట్టాలని అతని తల్లి చంగమ్మ .. ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు..
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!