మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కౌంటర్ ఎటాక్‌కు దిగారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. సీఎం చంద్రబాబు 76 ఏళ్ల ముసలివాడు అంటూ.. పేర్నినాని చేసిన కామెంట్‌పై ఫైర్ అయిన సోమిరెడ్డి.. మాజీ మంత్రి పేర్ని నానికి కొవ్వు ఎక్కువైంది. చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని, లోకేష్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని విరుచుకుపడ్డారు.. చంద్రబాబుతో పాటు పేర్ని నాని రామతీర్థం, అలిపిరి మెట్లు ఎక్కగలరా..? అనపర్తిలో చంద్రబాబు నడిచినట్లు 7 కిలోమీటర్లు నడవగలరా..? అని నిలదీశారు..
సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్లు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంట్రామిరెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా వచ్చాడంటే విచిత్రమైన వాతావరణం ఉంటుందన్న ఆయన.. ఆయన వళ్లే.. ఎండకాలంలో వర్షాలు, వర్షాకాలంలో వర్షాభావం ఉందని ఎద్దేవా చేశారు.. ఈ భిన్నమైన వాతావరణం కారణంగా.. ఒక్క పంట రైతులు వేయలేకపోతున్నారు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెడితే నాశనమే అంటూ హాట్ కామెంట్లు చేశారు..
గోవా గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు.. సీనియర్ రాజకీయ నేత, ఏపీ మంత్రిగా, కేంద్ర మంత్రిగానూ సేవలు అందించిన విజయనగరానికి చెందిన టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు ఇప్పుడు గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు.. దీంతో, ఉత్తరాంధ్రకు రెండో కీలక పదవి దక్కినట్టు అయ్యింది.. ఇప్పటికే ఒడిశా గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబు ఉండగా.. ఇప్పుడు గోవా గవర్నర్‌గా అశోక్ గజపతిరాజు నియమితులు అయ్యారు.. అయితే, తన 36 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ జీవితంలో.. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఉమ్మడి ఏపీలో మంత్రిగా, కేంద్ర మంత్రిగా ఇలా…
తిరుపతి రైల్వే స్టేషన్ సమీపంలో హిసార్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి మరియు వందే భారత్ రైలు సకాలంలో ఆగిపోయింది. రాజస్థాన్ నుండి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతికి నడుస్తున్న హిసార్ ఎక్స్‌ప్రెస్ రైలులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి, ప్రయాణికుల్లో భయాందోళనలు రేకెత్తించాయి.
ఇటు బీజేపీలో, అటు ఆరెస్సెస్ లో మోహన్ భగవత్ 75 ఏళ్లకు విరమణ వ్యాఖ్యలపైనే చర్చ జరుగుతోంది. నాగ్ పూర్ లో పుస్తకావిష్కరణలో భగవత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. మోడీ పేరు చెప్పకపోయినా.. ఆయన్ను ఉద్దేశించే పరోక్ష వ్యాఖ్యలు చేశారని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి.
జూన్ 21వ రాయుడును అనుచితమైన, అభ్యంతరకరమైన, కుట్రపూరితమైన, మా రాజకీయ ప్రత్యర్థుల ప్రలోభాలకు లొంగి, మాకు ఎన్నో రకాలుగా ప్రాణ, గౌరవ అంశాలలో భంగం కలిగించాడని.. దాంతో, రాయుడును పని నుండి తొలగించినట్టు వెల్లడించారట వినూత, చంద్రబాబు దంపతులు..
శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంఛార్జ్‌గా ఉన్న వినుత కోట వ్యవహార శైలి పార్టీ విధి విధానాలకి భిన్నంగా ఉన్నందున గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంచడమైంది.. ఆమెపై చెన్నైలో హత్య కేసు ఆరోపణలు పార్టీ దృష్టికి వచ్చాయి.. ఈ క్రమంలో వినుతను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు జనసేన అధిష్టానం ఓ ప్రకటనలో పేర్కొంది..