Minister RamPrasad Reddy: వైసీపీ డిజిటల్ బుక్‌పై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, సానుభూతిపరులపై దాడులు చేసి కష్టపెట్టారో వారి కోసం తమ వద్ద రెడ్ బుక్ ఉందని నాడు పాదయాత్రలో మా యువ నాయకుడు నారా లోకేష్ చెప్పారు.. రెడ్ బుక్‌లో ఎవరికైతే చోటు దక్కుతుందో వారందరికీ శిక్ష వేస్తామన్నారు..? కానీ, తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నేటి వరకు ఎవరిపైన కక్ష సాధింపు చర్యలు తీసుకోలేదన్నారు. రెవెన్యూ, లిక్కర్ స్కామ్‌లలో పట్టుబడిన వారు మాత్రమే జైలు పాలయ్యారు అని స్పష్టం చేశారు.. నాడు పేదల భూములు, ప్రభుత్వ భూములు లాక్కున్నారో వాళ్లందరూ కూడా ఒక్కొక్కరిగా చట్ట పరిధిలోకి తీసుకొచ్చి ప్రభుత్వం వారికి శిక్ష వేస్తుంది… దీన్ని జీర్ణించుకోలేకే నాడు వైసీపీ వారు చేసిన తప్పులను పూడ్చుకునేందుకే నేడు కొత్తగా వైసీపీ వాళ్లు డిజిటల్ బుక్ ను తీసుకొస్తున్నారు అని ఎద్దేవా చేశారు..
Read Also: Mahima Nambiyar : “ఇదే నా లాస్ట్ వార్నింగ్” – యూట్యూబ్ ఛానల్స్‌పై హీరోయిన్ ఫైర్
అయితే, వైసీపీ నేతలకు మేం ఛాలెంజ్ చేస్తున్నాం.. గడిచిన 16 నెలల్లో ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ, మిత్రపక్ష పార్టీలు చట్టపరంగా కాకుండా చట్టాన్ని వ్యతిరేకించి వైసీపీ వాళ్లపై కక్షపూరితంగా చర్య తీసుకొని ఉంటే మా దృష్టికి తీసుకురండి అని సవాల్ చేశారు రాంప్రసాద్ రెడ్డి.. మా సవాల్‌ను స్వీకరిస్తే.. మేం చర్చకు సిద్ధంగా ఉన్నాం అన్నారు.. 11 స్థానాలు దక్కించుకున్న వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు… ప్రజల పక్షాన పోరాడేందుకు ఒక్కరోజు కూడా అసెంబ్లీ గేటు తొక్కలేదు.. అలాంటివారు తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం పై బురద చల్లడం చాలా దారుణం అన్నారు.. రాజ్యాంగానికి లోబడే తమ ప్రభుత్వం పని చేస్తుంది… చట్టపరంగా ఎవరైతే తప్పు చేశారో వారందరూ శిక్ష అర్హులే అన్నారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి..