డిసెంబర్ 19, ఆదివారం రాశిఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. రవాణా రంగాల వారికి సంతృప్తి పురోభివృద్ధి కానవస్తుంది. ప్రముఖులను మీ ఇంటికి విందుకు ఆహ్వానిస్తారు. స్త్రీలు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలించవు. పెద్దలకు శుభాకాంక్షలు అందజేస్తారు. మిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
వృషభం : ఈ రోజు ఈ రాశిలోని నిత్యావసర వస్తు వ్యాపారులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు. కుటుంబీకుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. ఖర్చులు పెరగటంతో రుణ యత్నాలు, చేబదుళ్ళ కోసం అన్వేషిస్తారు.
Also Read
- US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
- Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
- Keir Starmer: ఇంగ్లండ్ మాజీ ప్రధాని మరో కీలక నిర్ణయం.. ఎంపీ పదవికి కూడా రాజీనామా
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
మిథునం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. సొంతంగా వ్యాపారం చేయాలనే దృక్పథం బలపడుతుంది. సమయానికి చేతిలో ధనం లేకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. మీరు తలపెట్టిన పనులలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.
కర్కాటకం : ఈ రోజు ఈ రాశిలోని మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికం. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కుటుంబ సౌఖ్యం, వాహనయోగం పొందుతారు. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. మిత్రుల మాటతీరు నిరుత్సాహం కలిగిస్తుంది.
సింహం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు శ్రమకు తగిన గుర్తింపు, రాణింపు, ప్రతిఫలం లభిస్తాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి యత్నాలు సాగించిన సత్ఫలితాలు లభిస్తాయి. చిరువ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్నేహితుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. మీ ఆశయానికి, అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయా లేర్పడతాయి.
కన్య : ఈ రోజు ఈ రాశివారిపై సన్నిహితుల సలహాలు, సూచనలు మంచి ప్రభావం చూపుతాయి. విద్యార్థులకు క్రీడా కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనం వసూలు కాకపోవడంతో స్వల్ప ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. బంధువులతో ఒత్తిడి, చికాకులు తలెత్తుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
తుల : ఈ రోజు ఈ రాశివారు ప్రముఖులతో తరచు సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. స్త్రీలకు బంధువుల నుంచి ఒత్తిడి, మొహమాటాలు ఎదురవుతాయి. మీ కదలికలపై కొంతమంది. నిఘా ఉందన్న విషయాన్ని గమనించండి. నూతన వ్యాపారాభివృద్ధికి చేయు పథకాలు, ఆలోచనలు సత్ఫలితాలనిస్తాయి.
వృశ్చికం : ఈ రోజు ఈ రాశిలోని స్త్రీలకు వస్త్ర, వస్తులాభం వంటి శుభఫలితాలుంటాయి. హోటల్, తినుబండారు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీమతి సలహా పాటించడంవల్ల ఒక సమస్య నుండి బయటపడతారు. మీ సంతానం అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచటం మంచిది. రావలసిన ధనం సకాలంలో చేతికందుతుంది.
ధనస్సు : ఈ రోజు ఈ రాశివారు వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. విదేశాలు వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు వాయిదా పడతాయి. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉత్తర ప్రత్యుత్తరాలు సమర్థంగా నిర్వహిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో జాగ్రత్త అవసరం.
మకరం : ఈ రోజు ఈ రాశిలోని మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు షాపింగుల కోసం ధనం ఖర్చు చేస్తారు. పరోపకారానికి పోయి సమస్యలు తెచ్చుకోకుండి భార్యా, భర్తల మధ్య విభేదాలు తలెత్తవచ్చు. వృత్తిపరంగా ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు.
కుంభం : ఈ రోజు ఈ రాశివారు కార్యసాధనలో ఓర్పు, పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. స్థిరచరాస్తుల విషయంలో పునరాలోచన మంచిది. సంగీత, సాహిత్య కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారస్తులకు సమస్యలు తలెత్తినా లాభదాయకంగా ఉంటుంది. మీ పనులు మందకొడిగా సాగుతాయి.
మీనం : ఈ రోజు ఈ రాశివారికి ఆర్థిక ఇబ్బందులు లేకున్నా వెలితిగా అనిపిస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. విందు వినోదాలలో పాల్గొంటారు.
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!