ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.. ఆ సంస్థకు సీఈవోగా ఉన్న సుందర్ పిచాయ్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు.. కరోనా మహమ్మారి కారణంగా పని విధానంలో, జాబ్ స్టైల్లో కీలక మార్పులు వచ్చాయి, వస్తూనే ఉన్నాయి.. మరీ ముఖ్యంగా వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ క్లాసులు.. ఒక్కటేంటి.. ఇంటి నుంచి బయటకు వెళ్లకుండానే అన్నీ చక్కబెట్టుకునేదానిపై ఫోకస్ పెరిగిపోయింది.. అయితే, క్రమంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో.. ఉద్యోగుల పని […]
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల […]
హుజురాబాద్ ఉప ఎన్నికల సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది.. ఇప్పటికే పలు మార్లు బీజేపీ అభ్యర్థి ఈటల వ్యవహారంపై ఈసీ తలుపుతట్టిన అధికార టీఆర్ఎస్ పార్టీ.. మరోసారి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు ఫిర్యాదు చేసింది.. బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్‌లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని.. హుజురాబాద్ నియోజక వర్గంలో కొత్త బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక, ఇప్పటికే ఈటల […]
టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ సవాల్ విసిరారు ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబు చేసిన ఆరోపణలు నిరూపిస్తే తక్షణం మంత్రి పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ ప్రకటించారు.. నిరూపించలేకపోతే చంద్రబాబు రాజకీయాలు వదిలేస్తారా..? అని ప్రశ్నించారు అవంతి శ్రీనివాస్.. రాష్ట్రంలో 80 శాతం మందికి సంక్షేమ పథకాలు అందాయో? లేదో..? మీ ఎమ్మెల్యేలను అడిగితే తెలుస్తుందంటూ చంద్రబాబుకు హితవుపలికిన ఏపీ మంత్రి… హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఆగ్రహం […]
తెలుగుదేశం పార్టీపై మరోసారి హాట్ కామెంట్లు చేశారు వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి.. టీడీపీ వెంటిలేటర్ మీద వున్న పార్టీ అంటూ సెటైర్లు వేసిన ఆయన.. అందుకే చంద్రబాబు అసహనంతో ఉన్నారని వ్యాఖ్యానించారు.. అందుకే బూతులు మాట్లాడిస్తూ.. కుంటసాకులతో దీక్షలు చేస్తూ.. రాజకీయలబ్ధి కోసం ప్రయత్నిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. ఇక, టీడీపీ హయాంలో ప్రజా కంఠక పాలన సాగిందన్నారు సాయిరెడ్డి.. వైసీపీ పాలనలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాలను చంద్రబాబు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డ ఆయన.. అందుకే ప్రభుత్వం […]
ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకీ పొలిటికల్ హీట్ పెరుగుతూనే ఉంది.. మాటల యుద్ధమే కాదు.. చివరకు దాడులకు వరకు వెళ్లింది పరిస్థితి.. ఇక, ఇప్పుడు ఓవైపు టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా చంద్రబాబు 36 గంటల దీక్ష చేస్తుంటే.. మరోవైపు టీడీపీ వ్యవహారశైలికి వ్యతిరేకంగా కౌంటర్ దీక్షలు చేస్తున్నాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఇది ఇక్కడితో ఆగేలా కనిపించడంలేదు.. శనివారం రోజు ఢిల్లీ వెళ్లేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఇప్పటికే కేంద్ర హోంశాఖ దృష్టికి దాడుల విషయాన్ని తీసుకెళ్లిన […]
ఆ బుడ్డోడి వయస్సు ఏడాది మాత్రమే.. అప్పుడే నెలకు రూ.75 వేలకు పైగా సంపాదిస్తున్నాడు.. ఇంతకీ.. ఏడాది వయస్సున్న చిన్నాడు.. ఏం చేస్తున్నాడు.. ఎలా సంపాదిస్తున్నాడు అనే ప్రశ్న వెంటనే బుర్రలో మెదిలిందా..? అయితే, ఆ బుడతడు ఇప్పుడు హాయిగా ఎలాంటి టెన్షన్ లేకుండా.. షికార్లు చేస్తున్నారు.. విమానంలో ట్రిప్పులు వేస్తూ.. పార్కులు, బీచ్‌ల్లో ఎంజాయ్ చేస్తున్నాడు.. ఇదేంటి..? తిరిగితే డబ్బులు ఇస్తారా? పైగా అది ఖర్చే కదా? అని మరో ప్రశ్న తలెత్తిందా? విషయం ఏంటంటే.. […]
టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష ఇవాళ ముగియనుంది.. గురువారం ఉదయం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో దీక్షకు దిగారు చంద్రబాబు.. టీడీపీ కార్యాలయాలు, ఆ పార్టీ నేతల ఇళ్లపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తల దాడులను నిరసిస్తూ దీక్ష చేస్తున్నారు.. ఆ దీక్షకు ‘ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు’ అంటూ పేరు పెట్టారు.. గురువారం ఉదయం నుంచి చంద్రబాబు 36 గంటల దీక్ష […]
కరోనా మహమ్మారికి పుట్టినిల్లు ఏది అంటే అంతా చైనా పేరును చెబుతారు.. మొదట్లో ఆ ఆదేశాన్ని కలవరానికి గురిచేసిన కోవిడ్ 19.. అన్ని దేశాల్లో ఆందోళనకర పరిస్థితికి చేరుకునేసరికి.. అక్కడ మాత్రం ఏమీ లేకుండా పోయింది. అయితే, అప్పుడప్పుడు.. కొత్త వేరియంట్లు వెలుగు చూస్తూ డ్రాగన్ కంట్రీని షేక్ చేస్తూన్నాయి. ఇప్పటికే పలు దాపాలుగా చైనాను మహమ్మారి పలకరించిపోయింది.. తాజాగా.. మరోసారి కలవరం సృష్టిస్తోంది.. దీంతో, కట్టడి చర్యలకు దిగింది కమ్యూనిస్టు సర్కార్.. వందలాది విమాన సర్వీసులను […]