* నేటి నుంచి మూడ్రోజుల పాటు గుజరాత్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, నేడు గాంధీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న ప్రధాని
* నేడు ఢిల్లీలో పంజాబ్ ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన.. స్కూళ్లు, ఆస్పత్రులను సందర్శించనున్న పంజాబ్ సీఎం బృందం
* నేడు మచిలీపట్నంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన, పిన్నమనేని విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వెంకయ్య
* నేడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి కేటీఆర్ భేటీ, టీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలపై చర్చించనున్న కేటీఆర్
* ఐపీఎల్‌లో నేడు రాజస్థాన్ వర్సెస్ కోల్‌కతా.. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* నేడు సంగారెడ్డిజిల్లా లో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న హరీష్‌రావు
* ఖమ్మం: నేడు మధిర మండలంలో 24వ రోజు కొనసాగనున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర
* నిర్మల్ జిల్లాలో నేడు మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలసి అంబేద్కర్ భవనాన్ని ప్రారంభించనున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.
* ప్రకాశం జిల్లా : మంత్రివర్గ విస్తరణలో స్థానం కోల్పోయిన అనంతరం మొదటిసారి ఒంగోలు వస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. భారీ స్వాగత ఏర్పాట్లు చేసిన వైసీపీ శ్రేణులు..
* ప్రకాశం : నాగులుప్పలపాడు మండలం చదలవాడ రఘునాయక స్వామి కళ్యాణం.. ఆకాశంలో గరుడపక్షి ఆలయ ప్రదక్షణ అనంతరం కల్యాణోత్సవాన్ని ఆనవాయితీగా నిర్వహించనున్న నిర్వాహకులు..
* నెల్లూరు జిల్లా వెంకటాచలం, పొదలకూరు మండలాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటన, సాయంత్రం 4 గంటలకు నెల్లూరులో జిల్లా అధికారులతో సమీక్ష
* నెల్లూరు రూరల్ మండలం పాత వెల్లంటి గ్రామంలో ఎం.ఎల్.ఏ.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకూ కార్యక్రమం
* అనంతపురం : గుంతకల్లు పట్టణంలోని ఈడిగ ఫంక్షన్ హాల్ లో మెగా వైద్య శిబిరం. పాల్గొననున్న స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్.
* కర్నూలు: నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
* శ్రీకాకుళం : వంశధార రిజర్వాయర్ ను పరిశీలించనున్న రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు.
* విశాఖ: నేడు నగరానికి రానున్న మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు… రేపు ఉపరాష్ట్రపతితో కలిసి పర్యటనల్లో పాల్గొననున్న గవర్నర్
* విశాఖ: రేషన్ కు నగదు బదిలీ పథకం… ప్రయోగాత్మకంగా గాజువాక, అనకాపల్లిలో పరిశీలించనున్న ప్రభుత్వం.. నేటి నుంచి లబ్ధిదారుల అంగీకారం తీసుకునేందుకు సర్వే… రెవెన్యూ, సచివాలయ సిబ్బందికి బాధ్యతలు
* పల్నాడు జిల్లా: నేడు మాచర్ల శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శేషవాహనంపై ఊరేగింపు.
* విశాఖ: నేడు నగరంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పర్యటన… ఆటో నగర్లోని బయో ఫ్యాక్ట్ రీసెర్చ్ కంపెనీ సందర్శించ నున్న మంత్రి… సాయంత్రం బీజేపీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశం
* నేడు సింహాద్రి అప్పన్నను దర్శించుకొనున్న డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు… సాయంత్రం పార్టీ కార్యాలయంలో ముఖ్యనాయకులతో సమావేశం
* కర్నూలు నేడు సి.బెళగల్ మండలం క్రిష్ణదొడ్డిలో శ్రీ కోన వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సంధర్భంగా వసంతోత్సవం
* కోనసీమ జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమం; సమాచార, పౌర సంబంధాలు; సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నేడు రామచంద్రాపురం విచ్చేస్తున్న చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి కృతజ్ఞతాభినందన ర్యాలీ