సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆలపాటి కృష్ణమోహన్ కూతురు పెళ్లి వైభవంగా జరిగింది… సందీప్-సబీన దంపతుల కుమారుడు శుభంతో ఆలపాటి వెంకటేశ్వరరావు మనవరాలు, ఆలపాటి కృష్ణమోహన్-మాధవి గారాల పట్టి దివ్య వివాహాన్ని ఈ రోజు రాత్రి ఢిల్లీ ఎరో సిటీలోని ఓ హోటల్లో సందడిగా నిర్వహించారు.. పలువురు వివిధ రంగాలు చెందిన ప్రముఖులు హాజరై దివ్య-శుభం దంపతులను ఆశీర్వదించారు.. ఇక, దిగువన ఉన్న ఫొటోలో.. ఆలపాటి కృష్ణమోహన్ కుమారుడు ఆదిత్య, ఆలపాటి కృష్ణ మోహన్, శుభం (పెళ్లి […]
రష్యా- ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు అందరినీ కలవరపెడుతున్నాయి.. వీటి ప్రభావం స్టాక్మార్కెట్లపై కూడా పడిన విషయం తెలిసిందే కాగా… రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అప్రమత్తమైంది భారత ప్రభుత్వం.. దీనిపై భారత విదేశాంగశాక ఓ ప్రకటన విడుదల చేసింది.. ఉక్రెయిన్‌లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేసినట్లు వెల్లడించింది.. పరిస్థితులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామని.. ఉక్రెయిన్‌లో భారత విద్యార్థులున్నందున అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించింది ప్రభుత్వం.. ఇక, భారత్-ఉక్రెయిన్ మధ్య […]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పరిష్కారానికి నోచుకోని విభజన సమస్యలపై చర్చల కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం జరగబోతోంది… కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ తొలి సమావేశం రేపు ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరగనుంది.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అధ్యక్షత జరిగే ఈ సమాశానికి.. త్రిసభ్య కమిటీలో సభ్యులుగా ఉన్న ఏపీ, తెలంగాణ సీఎస్‌లు పాల్గొననున్నారు.. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.. Read Also: Vijayawada […]
విజయవాడలో విధి నిర్వహణలో ఉన్న ఓ ఆర్టీసీ డ్రైవర్‌పై ఓ మహిళ వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే.. 5వ నంబర్ బస్ రూట్లో… ఆంధ్ర హాస్పిటల్ వద్ద రాంగ్ రూట్లో వచ్చిన వచ్చిన ఓ మహిళ.. తన వాహనానికి ఆర్టీసీ బస్సు తగిలిందంటూ ఓవర్ యాక్షన్ చేశారు.. వచ్చిందే రాంగ్ రూట్.. పైగా బస్సు డ్రైవర్‌పై రుబాబు చేసింది ఆవిడి.. బస్సు ఎక్కి మరీ డ్రైవర్‌పై దాడికి దిగింది.. ప్రయాణికులు వారిస్తున్నా వినిపించుకోకుండా.. డ్రైవర్‌ను పిడిగుద్దులు గుద్దింది.. […]
ఈ మధ్య తెలంగాణ సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ నేతలు… కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల వ్యవహారం నుంచి.. రాజకీయ విమర్శల వరకు ఈ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమన్న చందంగా ఉంది పరిస్థితి.. అయితే, ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. పీఎం మిత్రలో చేరాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. దాని కోసం ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.. వస్త్ర […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆ రాష్ట్ర ఓటర్లను ఉద్దేశిస్తూ ఓ వీడియో విడుదల చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. యూపీ ఓటర్లకు వార్నింగ్ ఇవ్వడంపై పెద్ద రచ్చ జరుగుతోంది.. ఈ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం.. చర్యలు ఎందుకు తీసుకోకూడదో తెలియిజేయాలంటూ నోటీసులు జారీ చేసింది.. 24 గంటల్లో సమాధానం చెప్పాలని డెడ్‌లైన్ పెట్టిన విషయం తెలిసిందే.. ఇక, ఈసీ నోటీసుపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్.. వివరణ ఇస్తానని తెలిపారు.. […]
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాలక ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతోంది.. ఆళ్లగడ్డలో అభివృద్ధి పేరట అక్రమాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిల ప్రియ ఆరోపిస్తున్నారు.. ఆధారాలతో సహా నిరూపిస్తానని.. నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేసిన ఆమె.. మరి రాజకీయ సన్యాసానికి మీరు సిద్ధమా అంటూ స్థానికల ఎమ్మెల్యేకు సవాల్ విసిరిన విషయం తెలిసిందే.. ఇక, ఇవాళ మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ.. తన సోదరుడు జగన్ విఖ్యాత్ రెడ్డికి […]
ఆంధ్రప్రదేశ్‌లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పటికే 51 గ్రా, వార్డు సచివాలయాల్లో ఈ సేవలు అందుతుండగా.. ఈ ప్రక్రియలు తలెత్తే సవాళ్ల పరిష్కారంపై ఫోకస్ పెడుతోంది సర్కార్.. దీనిలో భాగంగా ఇవాళ గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల అంశంపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను […]
తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు సందర్భంగా.. శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు సెలబ్రేషన్స్ నిర్వహించాలన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతూ.. అన్నదాన కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నాయి గులాబీ పార్టీ శ్రేణులు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లోనూ కేసీఆర్‌పై ఉన్న అభిమాన్నా చాటుకుంటూ.. వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక, పూరీ జగన్నాథుడి చెంత సముద్ర తీరంలో […]
ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ రోజువారి కేసులు.. కాస్త కిందికి పైకి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,663 శాంపిల్స్ పరీక్షించగా.. 675 మందికి పాజిటివ్‌గా తేలింది… దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,14,502కు చేరింది.. మరోవైపు, ఒకే రోజులో ముగ్గురు కోవిడ్ బాధితులు కన్నుమూశారు.. దీంతో.. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 1,405కు పెరిగింది.. ఇక, గడిచిన 24 గంటల్లో 2,414 మంది […]