ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి హస్తిన పర్యటనకు సిద్ధమయ్యారు.. రేపు ఢిల్లీకి వెళ్లనున్నా ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.. రేపు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం భేటీ కానున్నట్టుగా చెబుతున్నారు.. కొత్త జిల్లాల ఏర్పాటు, రాష్ట్రానికి నిధుల విషయంపై చర్చిస్తారని సమాచారం.. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన ఇతర పెండింగ్ విషయాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు.. ప్రధాని మోడీతో సమావేశం […]
ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం ఆరంభం.. కొత్తగా 13 జిల్లాలతో మొత్తం 26 జిల్లాల్లో పాలన ప్రారంభించారు.. కొత్త జిల్లాలను సీఎం వైఎస్ జగన్.. క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ బటన్ నొక్కి కొత్త జిల్లాలు అమలులోకి వచ్చినట్టు వెల్లడించారు సీఎం వైఎస్ జగన్.. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజల చెంతకు మరింత దగ్గరగా తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.. ఇక, కొత్త జిల్లాల ఏర్పాటును ఆహ్వానించారు […]
హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వేదికగా రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ – 2022 ఘనంగా జరిగింది.. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, మెగాస్టార్ చిరంజీవి… తదితరులు పాల్గొన్నారు.. ఇక, రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్‌లో భాగంగా శుక్రవారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులను సత్కరించారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథరామారెడ్డిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సత్కరించారు.. ఇక, కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ రవి మాట్లాడుతూ.. సంస్కృతితో […]
ప్రతీరోజు ఎక్కడో ఒక దగ్గర చిన్నారులు, అమ్మాయిలు, మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా అత్యాచార ఘటనలు ఆందోళనకు గురిచేస్తూనే ఉన్నాయి.. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు సురక్షితంగా ఇంటికి చేరతారా? అనే ఆందోళన ఓవైపు.. ఇంట్లో ఉన్నా సేఫ్‌గా ఉంటారా? అనే కలవరం మరోవైపు వెంటాడుతోంది.. అయితే, అత్యాచారాలకు మొబైల్ ఫోన్లు, సమాజంలోని వికృత మనస్తత్వమే కారణమని పేర్కొన్నారు గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవి.. మొబైల్ ఫోన్లలో అడల్ట్ వీడియోలను సులభంగా యాక్సెస్ చేయడం మరియు […]
ఉగాది రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఏకంగా 11 మంది ప్రాణాలను తీసింది.. తమిళనాడులో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపత్తూరు వద్ద ఓ ట్రక్కు 100 అడుగుల లోయలో పడిపోయిన ఘటనలో అక్కడికక్కడే 11 మంది మృతిచెందారు.. మరో 20 మంది తీవ్రగాయాలపాలయ్యారు.. మృతులంతా పులియూరు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.. తిరుపత్తూరు జిల్లాలోని సెంబరై ఆలయ దర్శనానికి బయల్దేరి వెళ్తుండగా.. ట్రక్కు ప్రమాదానికి గురైంది.. ఈ సమయంలో ట్రక్కులో 30 మందికి పైగా ఉన్నట్టుగా […]
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఎలుకలు కొరికిన ఘటన విషాదంగా మారింది. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శ్రీనివాస్ మృతి చెందాడు. హన్మకొండ భీమారానికి చెందిన శ్రీనివాస్ గత కొంతకాలంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, శ్రీనివాస్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగా.. ఆయన్ని ఎలుకలు కొరుక్కుతిన్నాయి. ఈ ఘటన సంచలనంగా మారడంతో.. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావుపై బదిలీ వేటువేసింది. […]
ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కుతోంది. తెలంగాణ పాలిటిక్స్ మొత్తం వడ్ల చూట్టూనే తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్ఎస్. ఈనెల 4 నుంచి 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. Read Also: Minister KTR : కిషన్ […]
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై సీఎస్ సమీర్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక అంశాలు ప్రస్తావించారు.. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు 6 నెలలు కాదు.. 60 నెలలు కావాలని పేర్కొన్నారు.. రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వర్కర్లు, యంత్రాలను రప్పించేందుకే రెండు నెలల సమయం అవసరమన్న ఆయన.. అమరావతిలో పనులు మొదలు పెట్టేందుకే 8 నెలల సమయం పడుతుందన్నారు.. రోడ్ల నిర్మాణం కోసం 16 నెలలు అవసరం అవుతుందని.. రోడ్ల పనులు పూర్తి చేశాక, డ్రైనేజి, […]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 భాగంగా ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.. జోస్ బట్లర్ సెంచరీ.. రాజస్థాన్ రాయల్స్‌కు 23 పరుగుల తేడాతో విజయం సాధించి పెట్టింది.. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సంజూ శాంసన్ నేతృత్వంలోని జట్టు వేగంగా నాలుగు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన గెలుపు నమోదు చేసింది.. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ హాఫ్ సెంచరీలతో ముంబైని పటిష్టమైన స్కోర్ వైపు నడిపించే […]
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలకు సంబంధించిన గెజిట్ ఏ క్షణంలోనైనా విడుదల కానుంది… జిల్లా పునర్విభజనకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ కు ఇప్పటికే కేబినెట్ ఆమోదం తెలపింది.. మొత్తంగా 26 జిల్లాలకు ఆమోదం తెలిపింది కేబినెట్.. 26 జిల్లాల్లో 73 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు కాబోతున్నాయి.. కొత్తగా 22 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారు.. కొత్తగా మన్యం జిల్లా, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, రాజమండ్రి, నరసాపురం, బాపట్ల, నర్సరావుపేట, తిరుపతి, అన్నమయ్య జిల్లా, నంద్యాల, సత్యసాయి, ఎన్టీఆర్-విజయవాడ […]