ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ఫలితాలు వెలువడ్డాయి.. కానీ, తెలంగాణలో ఇప్పటికీ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిపై తర్జన భర్జన పడుతున్నారు అధికారులు.. దీంతో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అనే విషయంలో గందరగోళం ఏర్పడింది.. ఈ ఏడాది కూడా రిజల్ట్ తక్కువగా ఉంటే పరిస్థితి ఏంటనే భయం అధికారులను వెంటాడుతున్నట్టు తెలుస్తోంది.. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల శాతం తక్కువ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనలు దృష్టిలో ఉంచుకుని.. తక్కువ శాతం రిజల్ట్ వస్తే మళ్లీ ఆందోళనలు చేస్తారరేమో అనే టెన్షన్ అధికారుల్లో ఉందని సమాచారం.. దీంతో, ఫలితాల వెల్లడిపై అధికారులు, ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోందట.. గ్రేస్ మార్క్స్ ఇవ్వాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. అయితే, ఆ మార్క్‌లు ముందు యాడ్ చేయాలా? తర్వత యాడ్ చేయాలా..? అనే విషయాన్ని కూడా తేల్చుకోలేని పరిస్థితి ఉందంటున్నారు..
Read Also: SBI: గుడ్‌న్యూస్ చెప్పిన ఎస్బీఐ.. ఒక్క కాల్‌తో అన్నీ..!
మరోవైపు, ఉత్తీర్ణత శాతం తక్కువ ఉండదని కూడా అధికారులు అంటున్నారు.. అయినా, సర్కార్ పెద్దలను మాత్రం ఫలితాలు టెన్షన్ పెడుతున్నాయట.. ఈ పరిస్థితుల్లో ఫలితాల ప్రకటన ఆలస్యం అయ్యే అవకాశం ఉందని.. మంగళవారం తర్వాతే ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తారనే చర్చ సాగుతోంది. మొత్తంగా తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TSBIE) ఈరోజు ప్రకటించాల్సిన ఫలితాలు వాయిదా వేసిందని చెబుతున్నారు..
ఎస్ఎస్‌సీ మరియు ఇంటర్మీడియట్ ఫలితాల తేదీ వాయిదా పడిందని.. బోర్డు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వచ్చే వారం ఫలితాలు వెల్లడిస్తారు తెలుస్తోంది.