ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన ఖాతాదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది.. ఎప్పటికప్పుడు తన ఖాతాదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోన్న ఎస్బీఐ.. ఇప్పుడు వారి కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్ తీసుకొచ్చింది.. 1800 1234 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే.. ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించనుంది.. బ్యాలెన్స్ చెక్ నుంచి ఫిర్యాదుల వరకు అన్నీ ఒకే కాల్‌తో పొందే వెసులుబాటు తీసుకొచ్చింది ఎస్బీఐ.. ఫోన్ చేసి ఇంటి నుంచి కదలకుండానే సేవలు పొందవచ్చన్నమాట.. ప్రతీ చిన్న పనికి బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఫోన్‌లోనే చక్కబెట్టుకునే విధంగా సేవలను అందించనుంది ఎస్బీఐ.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ నారాజ్..! ఢిల్లీ పెద్దల వద్ద ఆవేదన..!
టోల్ ఫ్రీ నంబర్ 1800 1234తోపాటు 1800 11 2211, 1800 425 3800, 1800 2100, 080-26599990 నంబర్లను కూడా అందుబాటులో ఉంచింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఆయా నంబర్లకు దేశంలోని మొబైల్, ల్యాండ్‌లైన్ నుంచి ఫోన్ చేసే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చు.. తమకున్న సందేహాలను అడిగి తెలుసుకునే వీలుంటుంది.. ఇక, కొన్ని సమస్యలు ఫోన్ ద్వారా పరిష్కారం కాకపోతే.. వాటికోసం ఈ-మెయిల్స్ ద్వారా ఫిర్యాదులను కూడా స్వీకరించనున్నారు.. customercare@sbi.in, contactcenter@sbi.in అనే ఈ-మెయిల్స్‌కు ఖాతాదారులు తమ సమస్యలను ఎస్బీఐ దృష్టికి తీసుకెళ్లవచ్చు.. మరోవైపు.. ఎస్సెమ్మెస్ ద్వారా ఫిర్యాదులను కూడా స్వీకరించనుంది.. సంబంధిత ఖాతాదారులు help అని టైప్ చేసి 91 81085 11111 అనే నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే.. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇక, ఖాతాదారుడు తన ఏటీఎం కార్డు పోయినా.. ఎవరైనా తీసుకెళ్లినా.. ఎస్సెమ్మెస్ పంపి గానీ, ఫోన్ చేసిగాదనీ దానిని బ్లాక్ చేయించవచ్చు. BLACK అని డెబిట్ కార్డులోని చివరి నాలుగు అంకెలుఅని టైప్ చేసి, 567676 ఎస్సెమ్మెస్ పంపితే.. వెంటనే సంబంధిత కార్డు నుంచి లావాదేవీలను నిలిపివేస్తారు.