చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని రేపు 12 గంటల పాటు మూసివేయనుంది టీటీడీ. ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు నిలిచిపోనుంది. మరోవైపు అన్న ప్రసాద సముదాయాన్ని కూడా రేపు మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి ఎల్లుండి ఉదయం 8:30 గంటల వరకు మూసి వేయనుంది టీటీడీ. రేపు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలతో పాటు పౌర్ణమి గరుడసేవను రద్దు చెయ్యగా.. ఎల్లుండి సిఫార్సు లేఖలపై జారీ చేసే వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది టీటీడీ.
మరో ఆందోళనకు సిద్ధమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. ఈనెల 9వ తేదీన వైసీపీ 'అన్నదాత పోరు' పేరుతో కార్యక్రమాలు నిర్వహించనుంది.. యూరియా కొరత, రైతాంగ సమస్యలపై నిరసనలకు పిలుపునిచ్చింది.. ఆర్డీవో కార్యాలయాల ఎదుట వైసీపీ శాంతియుత నిరసనలు తెలపనుంది.. 'అన్నదాత పోరు' పోస్టర్ని పార్టీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి విడుదల చేశారు.
ఎంపీ మిథున్‌రెడ్డికి కోర్టులో కాస్త ఊరట దక్కింది.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయటానికి ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఏసీబీ కోర్టు..
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ రోజు తాడిపత్రి పట్టణంలోని తన సొంత ఇంటికి చేరుకున్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ పరిణామంతో సుమారు 15 నెలల తరువాత కేతిరెడ్డి తన సొంత ఇంటికి చేరుకున్నట్టు అయ్యింది.. గత ఎన్నికల సమయంలో జరిగిన ఘర్షణల కారణంగా పట్టణానికి దూరంగా ఉంటూ వస్తున్నారు పెద్దారెడ్డి.. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో భారీ బందోబస్తు నడుమ తాడిపత్రి పట్టణంలోకి ఎంట్రీ ఇచ్చారు..
ఖైరతాబాద్ గణేషే కాదు బాలాపూర్ లడ్డూ వరల్డ్ ఫేమస్. హైదరాబాద్‌లో మహా నిమజ్జనం అంటే తొలుత అందరి చూపు బాలాపూర్ లడ్డూవైపే.ఈసారి వేలం ఎంత ఉత్కంఠగా జరుగుతోంది.లడ్డూ ధర ఎంత పలుకుతోంది?సరికొత్త రికార్డ్ బ్రేక్ అవుతుందా? ఎవరి నోట విన్నా ఇదే మాట. బాలాపూర్ గణపతి లడ్డూ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. లక్షల్లో పలుకుతూ ఏటేటా రికార్డులు బ్రేక్ చేస్తున్న ఈ లడ్డూ చరిత్ర ఎంతో ఘనమైంది.దీన్ని కొన్నవారికి కొంగు బంగారం అవుతుందనేది సెంటిమెంట్.లంబోదరుడి చేతిలో పూజలు అందుకున్న లడ్డూను దక్కించుకుంటే, వారింట సిరిసంపదలు…
హైదరాబాద్ నగరవ్యాప్తంగా భారీ ఊరేగింపులతో గణనాథులు హుస్సేన్ సాగర్‌కు తరలి వస్తున్నారు. ఊరేగింపు దారిలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ముందస్తుగానే 160 యాక్షన్ టీమ్‌లను సిద్ధం చేసిన జీహెచ్ఎంసీ... ఆ మార్గంలో దాదాపు 56,187 తాత్కాలిక లైట్లను అమర్చింది.
బాలాపూర్‌లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య..
గణపయ్యలకు భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులు.. గణపయ్యలకు బైబై చెబుతూ.. గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు.. గత రెండు మూడు రోజుల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని చెరువులతో పాటు.. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కొనసాగుతుండగా.. ఈ రోజు కీలక నిమజ్జనం జరగనుంది..
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి..?