Minister Atchannaidu: రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు టార్గెట్‌గా పెట్టుకున్నాం.. పార్వతీపురం మన్యం జిల్లాలో రహదారులు లేని గ్రామాలు పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇంచార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో జరిగిన జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, జిల్లా పరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకర రెడ్డి తదితరులు హాజరయ్యారు.
Read Also: Ravi Naidu Animini: ఇంటర్నేషనల్ స్టేడియంగా మారనున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం..!
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు 200 కి పైగా రహదారులు లేని గ్రామాలకు రోడ్లు ఏర్పాటు చేశాం.. మిగిలిన 284 గ్రామాల్లో రాబోయే రెండేళ్లలో రోడ్లు పూర్తి చేయాలి అని పీఆర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ఇంజినీర్లను ఆదేశించారు. రహదారి నిర్మాణంలో అటవీ శాఖతో సమన్వయం తప్పనిసరి అన్నారు. ప్రతి గ్రామానికి ఆటో, అంబులెన్స్ చేరుకునేలా రహదారి సౌకర్యం ఉండాలని స్పష్టం చేశారు. వ్యవసాయం – పశుసంవర్ధకంపై దృష్టి పెట్టాం.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి.. రైతులకు లాభసాటి వాణిజ్య పంటలపై అవగాహన కల్పించాలి.. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు మరింత పెంచేలా చర్యలు చేపట్టాలి.. సూక్ష్మ నీటి పారుదలతో ఉద్యానవన మరియు వ్యవసాయ పంటలకు నీటి సదుపాయం కల్పించాలి.. చేపల పెంపకాన్ని ప్రోత్సహించాలి.. జిల్లాలోని అన్ని చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Read Also: Tata Motors Offer: నెవర్ బిఫోర్.. టాటా కార్లపై రూ.1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!
వసతి గృహాల అభివృద్ధి.. రహదారి సౌకర్యం లేని 78 గిరిజన సంక్షేమ హాస్టళ్లకు రహదారులు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు అచ్చెన్నాయుడు.. అన్ని హాస్టళ్లలో సరిపడా టాయిలెట్లు ఉండాలన్న ఆయన.. అదనంగా అవసరమైన 294 టాయిలెట్స్‌ను సంక్రాంతికల్లా పూర్తి చేయాలన్నారు.. ఇక, రానున్న వారం నుంచి సోమవారం నుండి శనివారం వరకు రైతులతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు..ప్రతి రైతు సేవా కేంద్రం పరిధిలో, అధికారులు హాజరై రైతులకు మార్గదర్శకత్వం ఇవ్వాలని సూచించారు మంత్రి అచ్చెన్నాయుడు..