Andhra Pradesh: తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కసరత్తు సాగుతోంది.. ఇప్పటికే తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోసం జోరుగా కసరత్తు సాగుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సన్నాహాలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్‌కు అనుగుణంగా మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ శాఖలకు పలు కీలక సూచనలతో లేఖలు పంపింది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుండి సేకరించినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలని రాజకీయ పార్టీలు తమ పార్టీ కార్యకర్తలకు ఇప్పటికే సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల కోసం అవసరమైన పెద్ద మొత్తంలో బ్యాలెట్ బాక్సులు ఇతర రాష్ట్రాల నుండి తెప్పించేందుకు ఎన్నికల సంఘం వ్యూహరచన చేస్తోంది. అదనంగా పంచాయతీరాజ్ మరియు మున్సిపల్ శాఖల నుండి అదనపు సిబ్బందిని ఎన్నికల విధులకు అందించాలని కూడా SEC భావిస్తోంది.
Read Also: Andhra Pradesh: సీఎస్ సర్వీసు పొడిగింపుపై సీఎం కీలక నిర్ణయం…
వైసీపీ ప్రభుత్వం కాలంలో చివరిసారిగా 2021 ఫిబ్రవరి, ఏప్రిల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించబడ్డాయి. అయితే, గ్రామ పంచాయతీల పదవీ గడువు వచ్చే సంవత్సరం ఏప్రిల్ 2తో ముగుస్తుంది.. మున్సిపల్ సంస్థల గడువు మార్చి 17తో ముగుస్తుంది. MPTC, ZPTC ఎన్నికల గడువు సెప్టెంబర్ 3, 4 తేదీలతో ముగియనుంది.. మొత్తం 127 మున్సిపాలిటీలలో, 87 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించగా, 23 చోట్ల ఎన్నికలు జరగలేదు. 17 చోట్ల దశల వారీగా ఎన్నికలు జరిగాయి. పంచాయతీల విలీనానికి సంబంధించిన క్లియరెన్స్ ఈ నెలాఖరుకు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.