Rain Threat: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rain Threat: నార్త్ ఇండియాను అతలాకుతలం చేసిన భారీ వర్షాలు, వరదలు ఇప్పుడు సౌత్ ఇండియాపై విరుచుకుపడుతున్నాయి.. తెలంగాణలో ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి.. అటు వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సలహా పలు జిల్లాలను వణికిస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి ఇప్పటి వరకు వర్షం విడవకుండా కురుస్తూనే ఉంది.. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ రోజు ఆరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.. పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఈ రోజు అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది.
Read Also: Karnataka Crime: నిందితుల్ని పట్టించిన బీర్ బాటిల్ మూత.. కథలో మరో షాకింగ్ ట్విస్ట్
Also Read
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
వాతావరణ శాఖ నిన్న మధ్యాహ్నం ఇచ్చిన అప్‌డేటెడ్ ప్రకారం అల్లూరి సీతారామరాజు, తీరప్రాంత పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.. ఇదే సమయంలో.. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడన వర్షాలు పడతాయని పేర్కొంది.. ఈ సమయంలో గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక, అల్లూరి, ఏలూరు, ఎగువ పశ్చిమ గోదావరి జిల్లాల్లో శుక్రవారం కూడా భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది వాతావరణశాఖ. దక్షిణ ఒడిషా-ఉత్తరాంధ్రను అనుకుని స్థిరంగా తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. నెమ్మదిగా కదులుతూ ఇవాళ రోజంతా భారీ వర్షాలకు అవకాశం ఉందని.. ఈ సమయంలో తీరం వెంబడి గాలులు తీవ్రంగా వీస్తాయని.. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది వాతావరణశాఖ.
తాజావార్తలు
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!