ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన కొత్త హెయిర్ స్టైల్ లుక్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. షార్ట్ హెయిర్‌తో కనిపించే వార్నర్, ఇప్పుడు లాంగ్ హెయిర్‌తో దర్శనమిచ్చాడు. ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, “కొత్త హెయిర్ స్టైల్ అద్భుతంగా వచ్చింది” అని పేర్కొన్నాడు. ఈ లుక్‌తో ఆయన హాలీవుడ్ హీరోలా ఉన్నారని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వార్నర్ మరోసారి సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నారా అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన గతంలో నటించిన “రాబిన్ హుడ్ ” అనే […]
టికెట్ తీసుకోలేదన్న కోపంతో ఓ ప్రయాణీకుడి చెంప దెబ్బ కొట్టాడు కండక్టర్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో పోయిన గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడేమోనని యువకుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్ […]
కేరళలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సైబర్ నేరగాళ్లు ఈ సారి పోలీసులనే టార్గెట్ చేశారు. పోలీసులను మోసం చేసేందుకు జిల్లా పోలీస్ అధికారి ప్రథీప్ టి.కే. పేరుతో నకిలీ వాట్సాప్ అకౌంట్ ను ఏర్పాటు చేసి.. పోలీసుల నుంచే డబ్బులు అడిగేందుకు యత్నించాడు. దీనికి సంబంధించి జిల్లాలోని కొందరు అధికారులకు వాట్సాప్ నెంబర్ నుంచి మెసేజ్ లు రావడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇందులో ఓ ఉన్నతాధికారి ఫోటోను ప్రొఫైల్ ఫిక్ గా […]
అమెరికా సుంకాల కారణంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బంగారానికి మద్దతు లభిస్తోందని, దాని డిమాండ్ కూడా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం బంగారం 10 గ్రాములకు రూ. 1 లక్ష 8 వేల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. దేశంలో బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. MCXలో బంగారం ధర దాని పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. సెప్టెంబర్ 1న బంగారం, వెండి ఆల్ టైమ్ గరిష్ఠ […]
ఉత్తర ప్రదేశ్ మధురలోని గోవింద్ నగర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో తను ప్రేమించిన అమ్మాయి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన ఒక ఫోటోగ్రాఫర్ తన దుకాణంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్లో తన మరణానికి అమ్మాయి కుటుంబమే కారణమని పేర్కొన్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే…రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా లాలా వాలి గలి మెయిన్ బజార్లో నివసిస్తున్న ధర్మేంద్ర, తన మేనల్లుడు ఉదిత్ (25) శ్రీ కృష్ణ జన్మస్థాన్ సమీపంలోని పోట్రా కుండ్ దగ్గరలో VK […]
ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది. సీఎం నివాసానికి దగ్గరలో ఓ మహిళ చనిపోయేందుకు ప్రయత్నించింది. అక్కడ మోహరించిన భద్రతా సిబ్బంది పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను పట్టుకున్నారు. తనకు జరిగిన దారుణాన్ని వివరిస్తూ, బాధితురాలు తన నుంచి రూ. 60 లక్షలు మోసపోయామని చెప్పింది. పోలీసులు తన మాట వినకపోవడంతో.. తను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలని వేడుకున్నదా మహిళ. లక్నోలోని గౌతమ్‌పల్లి […]
Udaipur: భార్యను దారుణ హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు ఉదయపూర్‌లో భార్యను దారుణంగా హత్య చేసిన కేసులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నిందితుడు కిషన్‌లాల్ అలియాస్ కిషన్దాస్కు మరణశిక్షతో పాటు రూ. 50,000 జరిమానా , ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష విధించింది. నిందితుడు తన భార్యను లక్ష్మి హత్యచేయడమే కాకుండా, మొత్తం మానవాళిని కూడా సిగ్గుపడేలా చేశాడని కోర్టు తన ఉత్తర్వులో పేర్కొంది. నిందితుడిని చనిపోయే వరకు ఉరితీయాలని తీర్పుని వెల్లడించింది. పూర్తి […]
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ అప్పీలేట్ ట్రిబ్యునల్ NCLATని ఆశ్రయించారు. జెరాయ్ ఫిట్నెస్ తనకు రూ.7.24 కోట్లు బాకీ ఉందని ఆయన ఆరోపించారు. ఈ వివాదం ఆయన బ్రాండ్ ‘బీయింగ్ స్ట్రాంగ్’ కు సంబంధించినది. NCLT గతంలో ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. ఇప్పుడు సల్మాన్ ఆ ఉత్తర్వుపై మళ్లీ అప్పీల్ చేశారు. ఈ విషయంపై సల్మాన్ ఖాన్ చేసిన అప్పీల్‌ను గత వారం NCLAT యొక్క ఇద్దరు సభ్యుల ధర్మాసనం విచారించింది. అయితే, అతని న్యాయవాది […]
మెహుల్ చోక్సీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన కేసులో నిందితుడిగా ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను బెల్జియం అప్పీలేట్ కోర్టు మరోసారి తిరస్కరించింది. కోర్టులో అతని అప్పగింత విచారణకు కొద్దిసేపటి ముందు ఈ పిటిషన్ తిరస్కరించబడిందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో రూ.6300 కోట్లకు పైగా మోసం చేసిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెయిల్ పిటిషన్‌ను మరోసారి […]
రిలయన్స్ యూనిట్ జియో వచ్చే ఏడాది 5% వాటాను విక్రయించడం ద్వారా రూ.52,000 కోట్లు చేరుకుంటుందని కంపెనీ అధికారులు తెలిపారు. కంపెనీ విలువ $136-154 బిలియన్లుగా అంచనా వేశారు. ప్రస్తుతం రిలయన్స్ వార్షిక ఆదాయం రూ.10.71 లక్షల కోట్లకు చేరుకుంది. 50 కోట్ల జియో వినియోగదారులు మరియు 22 కోట్ల 5G కస్టమర్లు కూడా చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ యూనిట్ జియో దేశంలోనే అతిపెద్ద IPOను తీసుకురాగలదు. ఆ కంపెనీని వచ్చే ఏడాది (ఏప్రిల్-సెప్టెంబర్) స్టాక్ మార్కెట్లో […]