టికెట్ తీసుకోలేదన్న కోపంతో ఓ ప్రయాణీకుడి చెంప దెబ్బ కొట్టాడు కండక్టర్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో పోయిన గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్‌కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడేమోనని యువకుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్ సిబ్బంది రావడంతో అందరిని చెక్ చేశారు. యువకుడి దగ్గర టికెట్ లేకపోవడంతో అతడికి ఫైన్ వేశారు. కండక్టర్ నిర్లక్ష్యం చేశాడని, టికెట్ ఇస్తాడని తాను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్లు ఆరోపించాడు. దీంతో కండక్టర్‌కి, ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న కండక్టర్ ప్రయాణికుడి చెంపపై కొట్టి దుర్బాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో పక్కనే ఉన్న ఇతర ప్రయాణికులు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. కండక్టర్ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు.
దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్‌కి వెళ్తున్న బీఎంటీసీ బస్సు (KA‑57 F‑4029 )లో ఓ యువకుడు బస్సు ఎక్కాడు. అయితే కండక్టర్ వస్తాడని సదరు యువకుడు వేచి చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్ సిబ్బంది బస్సు ఎక్కి.. అందరి వద్ద టికెట్లు చెక్ చేశారు. సదరు యువకుడి వద్ద టికెట్ లేకపోవడం గమనించి ఫైన్ వేశారు. కండక్టర్ నిర్లక్ష్యం చేశాడని, టికెట్ ఇస్తాడని తాను చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్లు ఆరోపించాడు. దీంతో కండక్టర్‌కి, ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న కండక్టర్ ప్రయాణికుడి చెంపపై కొట్టి దుర్బాషలాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో పక్కనే ఉన్న ఇతర ప్రయాణికులు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అదికాస్తా వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అయితే కండక్టర్ అకస్మాత్తుగా వచ్చి తనపై దాడి చేశాడని బాధితుడు వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అయితే తాను మాత్రం కండక్టర్ ని తిరిగి కొట్టలేదని అన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయం చేయాలని తన పోస్టు ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో కండక్టర్ తీరుపై మండిపడుతున్నారు. వెంటనే కండక్టర్ చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా BMTC సిబ్బంది ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఇదేం కొత్తేంకాదని .. అధిక ఛార్జీలు వసూలు చేయడం, దురుసుగా ప్రవర్తించడం, నిర్లక్ష్యం, దాడికి సంబంధించిన సంఘటనలు గతంలో ఎన్నో జరిగాయంటున్నారు.