Gujjula Premender Reddy: తెలంగాణలో మోదీ పర్యటన.. షెడ్యూల్ ప్రకటించిన గుజ్జుల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Delhi Leaders Telangana Tour: తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు నిర్మల సీతారామన్, దేవేంద్ర ఫడ్నవిస్‌లు ఇక్కడి బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఒక్కొక్కొ రోజు ప్రచారం చేపట్టనున్నారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి వారి షెడ్యూల్‌ను ప్రకటించారు. సోమవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రధాని మోదీతో సహా పార్టీ అగ్ర నేతలు తెలంగాణలో ఉదృతంగా పర్యటిస్తారని తెలిపారు. పర్యటనలో భాగంగా 25, 26, 27 తేదీల్లో ప్రధాని మోదీ మూడు రోజుల పాటు తెలంగాణలో ఉండనున్నట్టు వెల్లడించారు.
Also Read: Hyderabad: మైనర్ బాలిక ఆచూకీ లభ్యం.. 5 రోజులు, 200 సీసీ కెమెరాలు వడపోసిన హెడ్ కానిస్టేబుల్
Also Read
ఇక రేపు మంగళవారం (నవంబర్ 21) నిర్మల సీతారామన్ జూబ్లీహిల్స్‌లో.. దేవేంద్ర ఫడ్నవిస్ ముషీరాబాద్‌లో పర్యటిస్తారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా ఈ నెల 24, 26, 28వ తేదీలలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఇక 23, 25, 26, 27వ తేదీలలో నాలుగు రోజుల పాటు జేపీ నడ్డా పర్యటన ఉంటుందని చెప్పారు. 23న నడ్డ ముదొల్, సంగారెడ్డి , నిజామాబాద్ అర్బన్‌తో పాటు హైదరాబాద్‌లో రోడ్డు షో నిర్వహిస్తారని, 24, 25, 26వ తేదీలలో యోగి అదిత్యనాథ్ 10 బహిరంగ సభల్లో పాల్గొంటారని, 24, 26వ తేదీలలో రాజ్‌నాథ్ సింగ్ రెండు రోజుల పాటు 6 సభల్లో పాల్గొంటారని వెల్లడించారు. హిమంత బిస్వ శర్మ ఈ నెల 22 నుంచి 27 వరకు అనేక బహిరంగ సభల్లో పాల్గొననున్నారని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ 22న వరంగల్ బహిరంగ సభ, 26న అమిత్ షాతో కలిసి జనసేనా అభ్యర్థికి మద్దతుగా హైదరాబాద్ సభలో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
Also Read: Hairstyle Video: క్రాకర్స్ ఇలా కూడా వాడుతారా.. జడలో పెట్టుకున్న మహిళ..!
తాజావార్తలు
-
AAS SGP : సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
-
Drugs Seized : ఒడిశా టూ హైదరాబాద్ ‘డెడ్ డ్రాప్’ డ్రగ్స్ నెట్వర్క్ గుట్టురట్టు
-
Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
-
Rashmika Mandanna: “నేను ఫిష్ కాదు”.. ‘మైసా’ షూటింగ్‌పై రష్మిక కామెంట్స్ వైరల్!
-
Water Crisis: హైదరాబాద్ కు తాగునీటి ముప్పు..!
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!