Will Jasprit Bumrah Join RCB ahead IPL 2024: ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ కూడా వదులుకుని ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఇది క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. తాజాగా ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడుతున్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం హార్దిక్ ముంబైలోకి రావడమే అట. అందులో […]
Why Hardik Pandya Joins Mumbai Indians again: ఐపీఎల్ 2024 ఎడిషన్‌కు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఫ్రాంచైజీ మార్పు ఇందులో ప్రధానమైన అంశం. గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ హార్దిక్‌ను రిటైన్ చేసుకున్నట్లే చేసుకుని.. అంతలోనే ట్రేడింగ్ అంటూ ముంబై ఇండియన్స్‌కి వదిలేసింది. ఈ అనూహ్య పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకసారి టైటిల్, మరోసారి రన్నరప్‌గా నిలబెట్టిన హార్దిక్‌ను […]
JioPhone Prima 4G Prepaid Plans: భారతీయ మార్కెట్ కోసం ప్రముఖ టెలికాం సంస్థ ‘రిలయన్స్ జియో’ నుంచి వచ్చిన తాజా ఫోన్ ‘జియోఫోన్ ప్రైమా’. ఐఎంసీ (ఇండియా మొబైల్ కాంగ్రెస్) 2023లో ప్రదర్శించబడిన ఈ ఫోన్.. నవంబర్ ప్రారంభంలో ప్రారంభించబడింది. కస్టమర్లకు డిజిటల్ వసతులకు చేరువ చేయడమే లక్ష్యంగా జియో కంపెనీ ఈ 4జీ ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. రూ.2,599 ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ ఫోన్‌ను.. సాధారణ జియోఫోన్ ప్లాన్లతో రీఛార్జ్ చేయడం […]
NEET Student dies by suicide in Kota: రాజస్థాన్‌లోని కోటాలో 20 ఏళ్ల విద్యార్థి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ ఏడాదిలో కోటాలో ఇప్పటివరకు ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28కి చేరింది. మృతుడు పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఫౌరీద్ హుస్సేన్‌గా పోలీసులు గుర్తించారు. కోటా నగరంలోని వక్ఫ్ నగర్ ప్రాంతంలోని తన గదిలో హుస్సేన్ ఉరివేసుకుని మృతి చెందాడు. విద్యార్థి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు […]
Virat Kohli Instagram Story Goes Viral: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి సంబందించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖంపై గాయాలు, ముక్కుపై బ్యాండేజీ ఉన్న ఫొటోను విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. ఫొటోలో కోహ్లీ తెలుపు రంగు టీ షర్ట్ వేసుకోగా.. ఎడమ కన్ను కమిలిపోయి ఉంది. అంతేకాదు కుడి చెంప, ఎడమవైపు నుదురు భాగంలో చిన్న గాయం ఉంది. ఈ ఫొటో నెట్టింట వైరల్ […]
Pakistan pacer Hasan Ali wishes to play in IPL: ప్రపంచంలో అతిపెద్ద క్రికెట్ లీగ్ ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్’ (ఐపీఎల్). ప్రపంచ క్రికెట్లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లు కుమ్మరించే ఈ లీగ్‌లో ఆడాలని ప్రతి క్రికెటర్ కలలు కంటాడు. ఐపీఎల్లో ఒక్కసారైనా ఆడితే చాలనుకునే ఎందరో విదేశీ స్టార్ క్రికెటర్స్ కూడా ఉన్నారు. లీగ్‌లో భాగమయ్యేందుకు అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు సైతం తమ దేశానికి ఆడే […]
Shakib Al Hasan to contest in Bangladesh Elections 2024: బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ కొత్త కెరీర్ ప్రారంభించబోతున్నాడు. షకీబ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నాడు. జనవరిలో జరిగే బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో షకీబ్ పోటీ చేయనున్నాడు. ప్రస్తుతం అధికారంలో ఉన్న అవామీ లీగ్ తరఫున తన స్వస్థలమైన మగురా–1 నియోజకవర్గం నుంచి షకీబ్ పోటీ చేస్తున్నాడు. అవామీ లీగ్ నుంచి షకీబ్‌కు టికెట్ కూడా ఖరారైంది. జనవరి 7న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. అవామీ […]
India vs Australia Playing 11 and Pitch Report: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా నేడు గువాహటిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. వరుసగా రెండు విజయాలతో జోరు మీదున్న యువ భారత్.. ఇప్పుడు సిరీస్‌పై కన్నేసింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు సిరీస్‌లో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కచ్చితంగా గెలవాల్సి ఉంది. పూర్తిస్థాయి జట్టుతో బరిలోకి దిగుతున్న ఆసీస్.. […]
Wines Closed for Next 3 Days in Telangana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మంగళవారం (నవంబర్ 28) సాయంత్రం 5 గంటల నుంచి గురువారం (నవంబర్ 30) సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలు నిలిపివేయనున్నారు. ఈ విషయంపై వైన్స్, బార్ల యజమానులకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ముందస్తు సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలోని మద్యం దుకాణాల యజమానులను రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ అప్రమత్తం […]
Rains in AP for three days Due to Low pressure in Bay of Bengal: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలో దక్షిణ అండమాన్ సమీపంలోని మలక్కా జలసంధి ప్రాంతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ.. బుధవారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరో 48 గంటల్లో తుపానుగా […]